తెలుగు-కన్నడ వివాదంపై స్పందించిన బ్రహ్మముడి రుద్రాణి.. అంతా ఒక్కటే అంటూ నిఖిల్ కే సపోర్ట్!
on Dec 25, 2024
తెలుగు టీవీ ఇండస్ట్రీపై బిగ్ బాస్ షో ప్రభావం గట్టిగానే పడింది. ఈ షో సాగుతున్నన్ని రోజులు టీవీ సీరియల్స్ రేటింగ్ పడిపోయాయి. అయితే సీజన్-8 లో కన్నడ యాక్టర్ నిఖిల్ గెలవడంపై , హౌస్ లో కూడా వారిదే మెజారీటీ ఉండటం.. వారికే బిగ్ బాస్ సపోర్ట్ చేయడం పెద్ద దుమారం రేగింది. ఈ తరుణంలో రీసెంట్ గా సీనియర్ యాక్టర్ కౌశిక్ తెలుగు ఆర్టిస్టులకి అవకాశాలు ఇవ్వడం లేదంటు ఎమోషనల్ అవ్వగా తాజాగా షర్మిత గౌడ కూడా రియాక్ట్ అయ్యింది.
స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో బ్రహ్మముడి కి ఉండే క్రేజే వేరు. అందులో సుభాష్, ప్రకాష్ లకి చెల్లిగా, రాజ్ కి మేనత్తగా రుద్రాణి పాత్రలో షర్మిత గౌడ నటిస్తోంది. ఇందులో మోస్ట్ పాపులర్ లేడి విలన్ గా షర్మిత గౌడ గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే తను తాజాగా మీడియాతో తెలుగు కన్నడ వివాదంపై మాట్లాడింది. తెలుగు కన్నడ అంటు ఏం లేదు.. అంతా ఆర్టిస్టులమే.. మనమంతా ఇండియన్స్ అని రుద్రాణి అంది. సీజన్-8 లో నిఖిల్‌ని గెలిపించాలని కోరుతూ అతనికి ఓట్లు వేయమని పోస్ట్ పెట్టింది రుద్రాణి. ఓ పక్క ఆల్ ఆర్ ఇండియన్స్ అంటూనే.. కన్నడ వాడు కాబట్టి నిఖిల్‌కి సపోర్ట్ చేస్తున్నావా అంటూ షర్మిత తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు.
తెలుగు కన్నడ అనే బాషాభేదాలు లేనట్లయితే హౌస్ లో అంత మంది కంటెస్టెంట్స్ ఉండగా కన్నడ అతడికే ఎందుకు సపోర్ట్ చేశారంటు నిజంగా షర్మితకి అంత కన్నడ భాషాభిమానం లేకపోతే.. తెలుగు కంటెస్టెంట్స్ అంతమంది ఉన్నారు కదా.. మరి వాళ్లలో ఎవరికైన సపోర్ట్ చేయొచ్చు కదా.. తెలుగు వాళ్లు గెలవకూడదా.. తెలుగు బిగ్ బాస్‌లో తెలుగు వాడు గెలవాలంటే తప్పా అంటూ షర్మితకి కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు. రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ నిఖిల్ గురించి మాట్లాడిన ఈ మాటలు.. మరోసారి ఈ వివాదానికి ఆజ్యం పోసినట్టుగా ఉన్నాయి. అయితే షర్మిత గౌడ చేసిన వ్యాఖ్యలని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా నిఖిల్ ఈ పోస్ట్ కి లైక్ చేయడంతో ఇది ఇప్పుడు మరింతగా ట్రెండింగ్ అవుతోంది.
Also Read