అక్కకి నెక్లెస్ ఎందుకు కొనిచ్చావ్.. షాక్ అయిన కావ్య!
on Dec 24, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. (Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -601 లో.... ఇంట్లో ఏది ఖర్చు చేసినా నాకూ చెప్పాలని కావ్య చెప్పడంతో.. రుద్రాణి, ధాన్యలక్ష్మిలకి కోపం వస్తుంది. మీరేం మాట్లాడడం లేదని ఇందిరాదేవితో ధాన్యలక్ష్మి అంటుంది. ఎప్పుడు నాకు నువ్వు పెద్ద దానివని విలువ ఇచ్చావ్.. నా భర్త అలా ఉంటే మీకు ఆస్తుల గురించి గొడవ పడుతున్నారని ధాన్యలక్ష్మికి ఇందిరాదేవి చురకలు అంటిస్తుంది.
నువ్వు అయిన చెప్పమని రాజ్ తో రుద్రాణి అనగానే.. నానమ్మనే ఏం అనడం లేదు.. నేనేం అంటాను.. నా ఫోన్ బిల్ కూడ తనే కట్టింది. తాళాలు తన చేతులో ఉన్నాయ్ కాబట్టి అందరం తను చెప్పినట్టు విందామని చెప్పి రాజ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎలా ఇలా మాట్లాడుతున్నావని కావ్యతో రాజ్ అంటాడు. నాలో ఉన్న మీరు ఇలా నాతో మాట్లాడిస్తున్నారు.. ఎదుటి వారిని తమ మాటల్తో కట్టి పడేయ్యడం మీ దగ్గర నుండి నేర్చుకున్నానని కావ్య అంటుంది. థాంక్స్ అని రాజ్ అనగానే.. మీకే థాంక్స్ ఒక భార్యకి థాంక్స్ చెప్పే భర్త దొరికినందుకని కావ్య అంటుంది. దాంతో రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత పనిమనిషి శాంత రావడంతో నిన్ను ఎవరు పిలిచారని రుద్రాణి గొడవపడుతంటే.. కావ్య వచ్చి నేనే పిలిచానని చెప్తుంది. మరొకవైపు ఇందిరాదేవి హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ లతో ఇంకా ఎన్ని రోజులు అవుతుంది. నా బావ బాగవ్వడానికి అని అడుగుతుంది. కొంచెం ఓపిక పట్టండి అని డాక్టర్ అంటాడు.
ఆ తర్వాత అందరు టిఫిన్ చెయ్యడానికి వస్తారు. టిఫిన్ ఒక ఇడ్లీ చెయ్యడంతో రుద్రాణి ఏంటి ఒక్కటే చేశారని అడుగుతుంది. ఇకనుండి ఒకటే అని కావ్య చెప్తుంది. మాకు వద్దు నచ్చింది ఆర్డర్ చేసుకుంటామని రాహుల్, రుద్రాణి, ధాన్యలక్ష్మిలు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, ప్రకాష్ దగ్గరికి వచ్చి ఆ కావ్య ఇలా చేస్తుందని ప్రకాష్ పైన కోప్పడుతుంది. తరువాయి భాగంలో మా కార్డ్స్ ని బ్లాక్ చేసావా అని రుద్రాణి అనగానే.. అవునని కావ్య అంటుంది. ఎందుకని రుద్రాణి అనగానే అనవసరమైన ఖర్చు పెట్టొద్దని కావ్య అంటుంది అయితే అక్కకి ఖర్చు పెట్టి నెక్లెస్ కొనొచ్చా అని ధాన్యలక్ష్మి అని అనగానే.. కావ్య షాక్ అవుతూ అక్క ఆ నెక్లెస్ కొనడానికి డబ్బు ఎక్కడిది అంటుంది. నువ్వే చెక్ ఇచ్చావ్ కదా అని స్వప్న అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read