Brahmamudi : ఒకే బెడ్ పై కోయిలి, గోల్డ్ బాబు.. ముక్కలైన రాహుల్ మనసు!
on Nov 4, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -869 లో.... కోయిలికి కావ్య చుక్కలు చూపిస్తుంది. కోయిలి ఫుడ్ బయట నుండి తెస్తే ఎందుకు తీసుకొని వచ్చావని తిడుతుంది కావ్య. నువ్వు ఇంట్లో వంట చెయ్ అని కావ్య అంటుంది. ఇంట్లో వంట చెయ్యడానికి కోయిలి నానాతంటాలు పడుతుంది. కావ్య దగ్గరుండి మరి కోయిలి చేత పని చేయిస్తుంది. మరొకవైపు రాహుల్ తో రాజ్ మాట్లాడుతాడు. కాసేపట్లో గోల్డ్ బాబూ రాబోతున్నాడని రాహుల్ తో రాజ్ చెప్తాడు.
కోయిలి పనులు చేసి నీరసంగా రాహుల్ దగ్గరికి వస్తుంది. ఏంటి ఈ అవతారం చూడలేకపోతున్నానని రాహుల్ అనగానే దాని ఒరిజినల్ అదే అని కావ్య అంటుంది. లేదు స్నానం చేసే వస్తే అందంగా ఉంటానని కోయిలి అంటుంది. అప్పుడే గోల్డ్ బాబు ఎంట్రీ ఇస్తాడు. తన మెడలో బంగారం చూసి కోయిలి టెంప్ట్ అవుతుంది. ఇక గోల్డ్ బాబు నాకు దుబాయ్ లో బోలెడన్ని బిజినెస్ లున్నాయని.. ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చానని అంటాడు. నా కంపెనీ లో పెట్టండి అని కోయిలి అంటుంది. ఆ తర్వాత గోల్డ్ బాబుకి కోయిలి గది చూపిస్తుంది. గోల్డ్ బాబూ సూట్ కేసు లో గోల్డ్ బిస్కెట్ లు చూసి కోయిలి ఫ్లాట్ అవుతుంది.
మరొకవైపు రాహుల్ కి రుద్రాణి ఫోన్ చెసి కావ్య, రాజ్ అక్కడికి వచ్చారట ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసాను.. నువ్వేం టెన్షన్ పడకని చెప్తుంది. రాజ్ సిస్టమ్ లో క్లయింట్ కి ఇవ్వాలసిన కొటేషన్ ని రుద్రాణి డిలీట్ చేపిస్తుంది. ఆ తర్వాత శృతి చూసేసరికి ఆ కొటేషన్ ఉండదు. వెంటనే రాజ్ కి ఫోన్ చేస్తే ఫోన్ కలవదు. దాంతో సుభాష్ కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. తరువాయి భాగం లో కోయిలి, గోల్డ్ బాబు ఒకే గదిలో బెడ్ పై ఉండడం రాహుల్ చూసి షాక్ అవుతాడు. కోయిలి కేర్ అఫ్ ఫ్లాట్ ఫామ్ అని రాహుల్ కి అసలు విషయాలన్నీ రాజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



