Brahmamudi : రాహుల్ కి దిమ్మతిరిగే షాక్.. యామిని కొత్త ప్లాన్!
on Jul 5, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -766 లో... రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. ఎంప్లాయిస్ అందరితో మాట్లాడతాడు. రాజ్ ఏం మాట్లాడుతాడో అని శృతి టెన్షన్ పడుతుంది. మరొక వైపు అందరు టిఫిన్ చేస్తుంటే రాహుల్ అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోతాడు. రాహుల్ డాక్యుమెంట్స్ తీసుకొని ఎక్కడికో వెళ్తున్నాడు.. మనం వెళ్ళాలని స్వప్న, అప్పు అక్కడ నుండి వెళ్తారు.
ఆ తర్వాత కావ్యకి శృతి ఫోన్ చేసి రాజ్ సర్ ఆఫీస్ కి వచ్చారు.. ఎంప్లాయిస్ అందరిని రమ్మని చెప్తున్నాడు.. ఎంప్లాయిస్ కి రాజ్ సర్ గతం మర్చిపోయాడని తెలియదు కదా.. మీరు త్వరగా రండి అని శృతి కావ్యకి చెప్తుంది. ఆ రాజ్ ఆఫీస్ కి వెళ్ళాడట.. రేపు ఆయన్ని తీసుకొని వెళ్లి సర్ ప్రైజ్ ఇద్దామనుకుంటే నాకే షాక్ ఇచ్చాడని కావ్య ఇంట్లో వాళ్ళకి చెప్తుంది.
ఆ తర్వాత రాజ్ తన క్యాబిన్ లో కూర్చొని ఉంటాడు. బాస్ లా నటించమన్నారని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే మేనేజర్ వచ్చి సంతకాలు పెట్టాలని ఫైల్ ఇస్తాడు. రాజ్ లెఫ్ట్ హ్యాండ్ తో సంతకం పెడుతుంటే మీరు ఎప్పుడు రైట్ హ్యాండ్ తో పెడతారు కదా అని మేనేజర్ అనగానే శృతి వచ్చి సర్ టూ హ్యాండ్ తో సంతకం పెడతారని కవర్ చేస్తుంది.
మరొకవైపు రాహుల్ తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి డాక్యుమెంట్స్ ఇస్తాడు. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే స్వప్న అప్పు ఎంట్రీ ఇచ్చి రాహుల్ కి షాక్ ఇస్తారు. చీపురుకట్టతో రాహుల్ పని పడుతుంది స్వప్న. దాంతో తన గర్ల్ ఫ్రెండ్ ఏడు వారాల నగలు ఇచ్చేసి పారిపోతుంది.
ఆ తర్వాత రాజ్ ఎంప్లాయిస్ అందరితో మాట్లాడుతాడు. మీరేం వర్క్ చేయడం లేదని కోప్పడతాడు. తరువాయి భాగంలో సిద్ధార్థ్ కి యామిని ఫోన్ చేసి రాజ్ కి గతం గుర్తు లేదు.. తను కంపెనీకి అన్ ఫిట్ అని నిరూపించు.. అప్పుడు కంపెనీ నీదే అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
