రెండో రోజు ఓటింగ్ తారుమారు.. ఆ ఇద్దరిలోనే విన్నర్!
on Dec 11, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో టాప్-5 నామినేషన్లో ఉండగా.. ఎవరు విన్నర్ అనేది తెలియడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక రోజురోజుకు ఓటింగ్ లో భారీ మార్పు వస్తుంది.
అఫీషియల్ ఓటింగ్ ఏంటనేది ఫినాలే నాడు ప్రకటించనుండగా.. అన్ అఫీషియల్ తొలిరోజు ఓటింగ్‌లో నిఖిల్ కొన్ని పోల్స్‌లో పైచేయి సాధిస్తే.. గౌతమ్ మరికొన్ని పోల్స్‌లో పైచేయి సాధించాడు. మొత్తం ఓటింగ్‌లో దాదాపు 80 శాతం ఓటింగ్ వీళ్లిద్దరే షేర్ చేసుకుంటున్నారంటే.. వార్ వన్ సైడ్‌గా వీళ్లిద్దరూ ఓట్లను షేర్ చేసుకుంటున్నారు. 80 శాతం ఓట్లు వీళ్లిద్దరికే పడుతుంటే.. ప్రేరణ, నబీల్, అవినాష్‌లు మిగిలిన 20 శాతం ఓట్లతో నామమాత్రంగా రేస్‌లో ఉన్నారు. తొలిరోజు ఓటింగ్‌లో గౌతమ్‌పై నిఖిల్ పైచేయి సాధించినట్టుగా కనిపించాడు. కానీ.. రెండో రోజు ఓటింగ్‌లో అనూహ్యంగా వీళ్లిద్దరూ 34 శాతం ఓట్లతో టై అయ్యింది. బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ ఆన్ లైప్ పోల్‌లో ఓటింగ్ లెక్కలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి.
తొలిరోజు నిఖిల్ 33 శాతం ఓట్లతో టాప్‌లో ఉంటే.. గౌతమ్ 25 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్‌లో కనిపించాడు. కానీ రెండోరోజు చూస్తే లెక్కలు తారుమారు అయ్యాయి. గౌతమ్ 34 శాతం ఓట్లతో టాప్‌లోకి వచ్చాడు. నిఖిల్‌కి కూడా 34 శాతం ఓట్లే వచ్చినా.. 67,270 ఓట్లు గౌతమ్‌కి పడితే.. నిఖిల్‌కి 67, 200 ఓట్లు పడ్డాయి. ఈ ఇద్దరికీ కేవలం 70 ఓట్ల వ్యత్యాసంతో గౌతమ్ టాప్‌లోకి వచ్చేశాడు. దీన్ని బట్టి చూస్తే.. గంటగంటకూ లెక్కలు ఎలా మారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి.. నిఖిల్, గౌతమ్‌లో విన్నర్ ఎవరనేది మాత్రం.. చివరి క్షణం వరకూ ఉత్కంఠే. ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు. బట్ విన్నర్ మాత్రం ఈ ఇద్దరిలో ఒకరేననేది మాత్రం పక్కా. మరో మూడు రోజుల్లో ఓటింగ్ లైన్స్ పూర్తి కానున్నాయి. ఆదివారం నాటి ఎపిసోడ్ తో ఈ సీజన్ ముగియనుంది. మరి ఈ సీజన్-8 విన్నర్ ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.