ఏడోవారం బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్.. నామినేషన్లో ఎవరెవరు ఉన్నారంటే!
on Oct 16, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో ఏడో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇక ఇందులో ఎన్నో ట్విస్ట్ లు, మరెన్నో ఆర్గుమెంట్స్ జరిగాయి. ఒక్కో కంటెస్టెంట్ తమ డిఫెండింగ్ ని, నామినేషన్ ని చేసిన తీరుతో ఏడోవారం రసవత్తరంగా సాగింది.
గౌతమ్ కృష్ణని అశ్వత్థామ 2.0 అనొద్దని చెప్పడం, అవినాష్ ని ఇది కామెడీ షో కాదని గౌతమ్ చెప్పడం, రోహిణి పర్సనల్ గా తీస్కోవడం హైలైట్ గా నిలిచింది. యష్మీని టేస్టీ తేజ నామినేట్ చేశాడు. మీది ఫ్రెండ్ షిప్ అన్నావ్. మళ్లీ ప్రేరణని నామినేట్ చేశావ్ అంటు టేస్టీ తేజ చెప్పడంతో.. తను నాకు పది సంవత్సరాల నుండి ఏం తెల్వదు..మా మధ్య ఫ్రెండ్ షిప్ లేదంటూ యష్మీ చెప్పడం తన కన్నింగ్ స్వభావాన్ని తెలియజేస్తుంది. ఇక నబీల్ చేసిన నామినేషన్ వ్యాలిడ్ అనిపించింది. గౌతమ్ ఆటతీరు బాలేదంటూ చెప్పిన రీజన్స్ సరిగ్గా సరిపోయాయి. ఇక పృథ్వీని గంగవ్వ నామినేట్ చేసింది. నిన్నటి ఎపిసోడ్ లో అవినాష్- పృథ్వీల మధ్య జరిగిన గొడవ పూర్తిగా పర్సనల్ అయిపోయింది. ఇక అంత గొడవపడి అవినాష్ ని నామినేషన్ లోకి తీసుకురాగా బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ మామ.
ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపడానికి నామినేట్ అయిన సభ్యులు.. గౌతమ్, పృథ్వీ, నిఖిల్ మణికంఠ, యష్మీ, తేజ, నబీల్, ప్రేరణ, అవినాష్. అయితే రాయల్స్ మీ దగ్గర మీరు గెలుచుకున్న ఇమ్యూనిటీ షీల్డ్ ఉంది.. దాన్ని మీరు వినియోగించుకోవచ్చు.. దాని ద్వారా నామినేషన్స్‌లో ఉన్న వారిని ఒకరిని సేవ్ చేయొచ్చు కానీ దానికి బదులుగా మీరు ఒకరిని స్వాప్ చేయాలంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఆ షీల్డ్‌ను గంగవ్వ-అవినాష్ కలిసి గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో అవినాష్ ఆ పవర్‌తో తనని సేవ్ చేసుకొని ఆ ప్లేస్‌లో హరితేజను స్వాప్ చేశాడు. దాంతో గౌతమ్, పృథ్వీ, నిఖిల్, మణికంఠ, యష్మీ, టేస్టీ తేజ, ప్రేరణ, నబీల్, హరితేజ ఈ వారం నామినేషన్లో ఉన్నారు. మరి వీరిలో మీ ఓటు ఎవరికి? ఎవరు ఈ వారం హౌస్ నుండి బయటకి వస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Also Read