ట్రెండింగ్ లో బిగ్ బాస్ నామినేషన్స్ ప్రోమో.. దామిణి వర్సెస్ యావర్!
on Sep 18, 2023
బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అయింది. రెండవ వారం షకీల ఎలిమినేట్ అయింది. కాగా ఇప్పుడు హౌజ్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సోమవారం రోజున జరిగే నామినేషన్లకి ఒక క్రేజ్ ఉంటుంది. ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
నామినేషన్లు ఒక పొలిటికల్ పార్టీకి మరొక పొలిటికల్ పార్టీకి మధ్య మాటల యుద్ధంలా జరుగుతుంటాయి. కాగా ఈ నామినేషన్లో ప్రియాంక జైన్ కొత్తగా జాయిన్ అయింది. గత రెండు వారాల్లో ఒక్కసారి కూడా నామినేషన్ కానీ శుభశ్రీ రాయగురు, ప్రియాంక జైన్ మూడవ వారం నామినేషన్లో ఉన్నారు. ఇక ఆట సందీప్, శివాజీ ఇద్దరు పవరస్త్రని సాధించారు కాబట్టి వారు నామినేషన్లో ఉండరు. మిగిలిన పది మందిలో ఏడుగురు నామినేషన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. యావర్ కి దామిణికి మధ్య మాటల యుద్ధం జరినట్టుగా ఉంది. ఇక శుభశ్రీని అమర్ దీప్ నామినేట్ చేసి.. అసలు ఏనాడైన హౌజ్ లో ఊడ్చావా అంటూ నిలదీశాడు. ఇక అందరు రతికని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.
ప్రియాంక జైన్, శుభశ్రీ రాయగురు, దామిణి, అమర్ దీప్, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, రతిక నామినేషన్లో ఉన్నట్టుగా తాజాగా రిలీజైన ప్రోమోలో తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరు కాలేదో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అయితే ఇప్పటికైతే టేస్టీ తేజ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ వీక్ కంటెస్టెంట్ అని తెలుస్తుంది. కాగా ఈ సారి పల్లవి ప్రశాంత్ సేఫ్ లో ఉన్నాడు. అతడిని ఎవరు నామినేట్ చేయలేదని తెలుస్తుంది. అయితే అమర్ దీప్ కి నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి మూడవ వారం బిగ్ బాస్ హౌజ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఉల్టా పల్టాతో సాగుతున్న ఈ సీజన్ లో మూడవ వారం ఎలా ఉంటుందో చూడాలి మరి!
Also Read