నీ భార్య రావల్సింది నువ్వెందుకు వచ్చావ్.. పృథ్వీ వరెస్ట్ బిహేవియర్!
on Oct 16, 2024
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. ఈ సీజన్ లో ఇదే హై ఓల్టెజ్ నామినేషన్ అని చెప్పొచ్చు. పృథ్వీ అవినాష్ ని నామినేట్ చేశాడు. అప్పుడు హ్యట్ హరితేజ దగ్గర ఉంటుంది. నువ్వు నన్ను బయట చూసి వచ్చి నేను గేమ్ ఆడట్లేదని లాస్ట్ వీక్ నామినేట్ చేసావ్. అందుకే ఇప్పుడు నిన్ను నామినేట్ చేస్తున్నానని పృథ్వీ అంటాడు. సీరియస్ గా చెప్పాలంటే కొన్ని ఎపిసోడ్ లు మాత్రమే చూసాను.. షూటింగ్ బిజీ లో చూడలేకపోయానని అవినాష్ అంటాడు.
కానీ నా భార్య రోజు చూసేది.. తనని అడిగాను.. ఎవరు... ఏంటని అవినాష్ అనగానే.. మీ భార్యనే రావచ్చు కదా.. నువ్వు ఎందుకు వచ్చావంటూ పృథ్వీ పొగతుగా అనేసరికి.. భార్య గురించి మాట్లాడకంటూ అవినాష్ సీరియస్ అయ్యాడు. నువ్వు అంత బిజీగా ఉన్నప్పుడు ఎందుకు రావడం.. తానే రావొచ్చు కదా అని పృథ్వీ అంటాడు. అంటే ఒక ఆడియన్ గా తన ఒపీనియన్ తెలుసుకోవాలి కదా.. కీ పాయింట్స్ అడిగి తెలుసుకున్నానని అవినాష్ అంటాడు. నువ్వు ఎపిసోడ్ లు చూడకుండా వచ్చి నేను గేమ్ ఆడలేదని ఎలా నామినెట్ చేసావ్ రా అని పృథ్వీ అనగానే.. రా అనకు అంటూ అవినాష్ సీరియస్ అవుతాడు. వాడు వీడు అంటూ పృథ్వీ కోపంగా మాట్లాడతాడు.
అలా మాట్లాడకు సంస్కారం నేర్చుకోమని అవినాష్ టంగ్ స్లిప్ అవ్వకుండా మాట్లాడతాడు. ఆ తర్వాత అవినాష్ చేతులు కట్టుకొని.. ప్లీజ్ పృథ్వి నన్ను అలా వాడు వీడు అనకు అంటూ అవినాష్ అడుగుతాడు. ఇలా చెప్తే వింటారా అని అవినాష్ అనగానే.. హ వింటాను.. ఇక అననులే అంటు పృథ్వీ పొగరుగా మాట్లాడతాడు. అవినాష్ ని వాడు వీడు అంటుంటే హౌస్ మేట్స్ అందరు పృథ్వి ఆలా మాట్లాడకని అంటారు.
ఆ తర్వాత పృథ్వీ పాయింట్ వ్యాలిడ్ గా ఉంది.. వాడు వీడు అనడం తప్పు కానీ మీరు మీ భార్య చేపిన దాన్ని పట్టుకొని వచ్చి నామినేట్ చెయ్యడం కరెక్ట్ కాదని అవినాష్ ని హరితేజ అంటుంది. మీరు అన్ని ఎపిసోడ్ లు చూసారా అని అవినాష్ అనగానే.. చూసానని హరితేజ అంటుంది. అయితే పృథ్వీ ఏ గేమ్ బాగా ఆడాడంటూ అవినాష్ అడగగా.. నాకు గుర్తు లేదని హరితేజ అంటుంది. మీరు నాతో కొన్ని ఎపిసోడ్ లు మాత్రమే చూసానని అన్నారని రోహిణి అవినాష్ లు అంటారు. అయిన కూడా పృథ్వీ పాయింట్ వ్యాలిడ్ గా ఉందని అవినాష్ ని నామినేట్ చేస్తుంది హరితేజ. అయితే అవినాష్ దగ్గర నామినేట్ స్టార్ ఉండడంతో అది యూజ్ చేసీ సేవ్ అయి ఇంకొకరి స్వాప్ చెయ్యాలి.. అవినాష్ సేవ్ అయి హరితేజ ని స్వాప్ చెయ్యడంతో హరితేజ నామినేట్ అవుతుంది.
Also Read