ఈ వారం యష్మీ గౌడ ఎలిమినేషన్.. కారణం టేస్టీ తేజ
on Oct 16, 2024
బిగ్ బాస్ హౌస్ లో మల్టీ టాలెంటెడ్ భామ ఎవరంటే ఠక్కున యష్మీ పేరు చెప్తారు. అందంతో పాటు అగ్రెసివ్.. సెల్ఫిష్.. కన్నింగ్.. స్ట్రాటజీ.. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి.
హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే అందరు తనని చూసి సాఫ్ట్ గా ఉందనుకున్నారు కానీ నామినేషన్ వస్తే గాని తెలియలేదు ఈ అమ్మడు నిజస్వరూపం. హౌస్ లో చాలా మందికి యష్మీ అంటే నచ్చదు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఏనిమిది మందిలో దాదాపు ఏడుగురు యష్మీనే నామినేట్ చేసారు.
అందరు కూడ యష్మీ హౌస్ మేట్స్ తో రూడ్ బిహేవియర్ గా ఉంటుందంటూ మళ్ళీ రెచ్చగొట్టేలే తన చేష్టలు ఉంటాయంటు ఒక నెగటివ్ ఉంది. తనకి నచ్చిన వాళ్ళు గెలిస్తే ఒకరకంగా.. నచ్చని వాళ్ళు ఓడిపోతే ఇంకా వాళ్ళని పోక్ చేసేలా బెహేవ్ చేస్తుంది. దాంతో ప్రేక్షకులకు సైతం యష్మీ బిహేవియర్ నచ్చలేదు. మధ్యలో రెండు వారాలు బానే ఉన్నా నామినేషన్ వచ్చేసరికి.. ఏదో శక్తి పూనుకున్నట్లు చేస్తుంటుంది. అయితే నామినేషన్ లో యష్మీని టేస్టీ తేజ నామినేట్ చేసాడు. తేజ యష్మీ డ్యూయల్ రోల్ గురించి చక్కగా ఎక్స్ ప్లెయిన్ చేశాడు. దాన్ని కవర్ చెయ్యడానికి ఈ భామ ఏడుపు మొదలు పెట్టింది.
అయితే ఎప్పటినుండో యష్మీ పై నెగటివ్ ఉన్న ప్రేక్షకులు గత వారంలో తన కన్నా వీక్ కంటెస్టెంట్ ఉండడం వల్ల.. తను నెట్టుకొచ్చింది. అయితే ఇప్పుడున్న నామినేషన్ లో దాదాపు అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇప్పుడు నిర్ణయం ప్రేక్షకుల చేతిలో ఉంది. ఎప్పటినుండో ఎదురు చూస్తున్న అవకాశం ప్రేక్షకులకు రానే వచ్చింది. యష్మీ ని సేవ్ చేస్తారో లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఉంచేస్తారో చూడాలి మరి.
Also Read