అక్కా నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది
on Apr 3, 2024
ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో ఒక స్ట్రాంగ్ లేడీ అని చెప్పొచ్చు. ఎందుకంటే తానొక ట్రాన్స్జెండర్ అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి తనకు నచ్చినట్టు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో, బుల్లి తెర మీద చాలా మందిని చూస్తూ ఉంటాం.. కానీ సెల్ఫ్ హప్పినెస్స్ ఉన్న వాళ్ళను చాలా తక్కువ మందినే చూస్తూ ఉంటాం. అలాంటి వారిలో ప్రియాంక సింగ్ కూడా ఒక అమ్మాయి. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోదు.. నచ్చినట్టు బతకడమే ఆమెకు చాలా ఇష్టం. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎప్పుడు అంతలా చెప్పుకోదు. ఆ కష్టాల కార్డుని అస్సలు యూజ్ చేసుకోదు.. ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్. అలాగే ఆమె ఫోటో షూట్స్ కి కూడా స్పెషల్ ఫాన్స్ ఉన్నారు. రీసెంట్ ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేసింది. అందులో బ్లూ కలర్ శారీలో దేవకన్యలా మెరిసిపోతూ కనిపించింది. అలాగే ఆ వీడియోకి "సుందరి..నీవే నేనంటా" అనే సాంగ్ ని యాడ్ చేసింది.
ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఐతే "నువ్వు సుందరివి కాదు వయ్యారివి...అక్కా అసూయగా ఉంది నిన్ను చూస్తుంటే..మీకు ఎలాంటి డ్రెస్ ఐనా అలా కరెక్ట్ గా సరిపోతుంది. లుకింగ్ ఆసం, బ్యూటిఫుల్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌బాస్‌తో పాపులర్ అయ్యింది ప్రియాంక సింగ్. జబర్దస్త్‌లో లేడీ గెటప్‌తో అలరించిన ఆమె ఆ తర్వాత సర్జరీ చేసుకుని పూర్తిగా అమ్మాయిలా మారిపోయింది. 'హనుమాన్' మూవీ ఫేం ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఓ మూవీలో అలాగే హాట్‌స్టార్‌లో హీరోయిన్‌గా లాంచ్ అవుతోంది ప్రియాంక సింగ్. ఐతే ఈమె అందానికి టాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా ఐపోతున్నారు. ఐతే రీసెంట్ గా ఆమె హెల్త్ కూడా కొంత అప్ సెట్ అయ్యింది. దాని వల్ల జీ తెలుగులో ప్రసారమైన జీ డాన్స్ జోడి షో నుంచి కూడా ఆమె తప్పుకుంది.