రూల్స్ పెట్టారు..ఏం లాభం..ఫాలో అవ్వాలి కదా!
on Dec 10, 2022
బుల్లితెర నటుడు పవన్ సాయి గురించి అందరికీ తెలుసు. ఫస్ట్‌టైమ్ కామెడీ రోల్ ఉన్న "హ్యాపీడేస్" సీరియల్లో ‘బ్లూటూత్’ పాత్రలో నటించే అవకాశం వచ్చింది పవన్ కి . తర్వాత మొగలిరేకులు, శ్రావణసమీరాలు వంటి సీరియల్స్ లో నటించాడు. ‘జీ తెలుగు’ ఛానల్ లో ‘ముద్దమందారం’ సీరియల్లో పెద్దబాబుగా ఆకట్టుకున్నాడు.
ఇప్పుడు స్టార్ మాలో ప్రసారమవుతున్న "మల్లీ..నిండు జాబిల్లి" సీరియల్ లో అరవింద్ పాత్రలో నటిస్తున్నాడు. ఐతే పవన్ సాయికి ఈమధ్య బాగా కోపం వచ్చింది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. కార్ లో వెళుతూ అడ్డదిడ్డంగా వెళ్తున్న వాహనాలతో ట్రాఫిక్ సమస్యలతో ఆయనకు బాగా కోపం వచ్చింది. "భరత్ అనే నేను" మూవీలో మహేష్ బాబు ఎలాగైతే ట్రాఫిక్ ని చూసి షాకయ్యాడో అచ్చం అలాగే పవన్ సాయి కూడా రియాక్ట్ అయ్యాడు.
"ఈ ట్రాఫిక్ తో చాలా చిరాగ్గా ఉంది. ఎలా పడితే అలా వెళ్తున్నారు. ట్రాఫిస్ రూల్స్ అసలు ఎవరూ పాటించడంలేదు...24 / 7 ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎవరికీ ఏ సమస్య రాదు" అని కోపంగా ఉన్న ఎమోజిస్ ని కూడా కలిపి తన ఒపీనియన్ ని తన ఇన్‌స్టా స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
