ఎక్కువ మాట్లాడొద్దు.. ప్రియాంకకు ముమైత్ వార్నింగ్!
on Mar 30, 2025
డాన్స్ ఐకాన్ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో చూస్తే అద్దిరిపోయే ఒక వైల్డ్ ఫైర్ తో వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చేసారు. ఆ మెంటార్ ఎవరో కాదు ముమైత్ ఖాన్. ముమైత్ ఖాన్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. "ఇప్పటికింకా నా వయసు నిండా 16 " సాంగ్ తో ఉర్రూతలూగించింది. ఆ ముమైత్ ఖాన్ తన కంటెస్టెంట్ అన్షికాతో వచ్చి డాన్స్ ఇరగదీసింది. ఇక దీపికా ఐతే "ఇది ముమైత్ ఖాన్ కాదు..ముంబై నుంచి వచ్చిన డాన్ " అంటూ చెప్పింది. గత ఎపిసోడ్ లో బ్రహ్మముడి మానస్ కి అలాగే ప్రాకృతికి జరిగినట్టు.. రావడంతోనే ప్రియాంక జైన్ కి ముమైత్ ఖాన్ కి మధ్య ఎలిమినేషన్ వార్ జరిగింది.
"ముమైత్ ని అన్షికాని నామినేట్" చేయాలనీ అనుకుంటున్నా అంటూ ప్రియాంక చెప్పింది. ఎందుకు అని ముమైత్ కూడా అడిగేసరికి వైల్డ్ కార్డ్స్ గా వచ్చి మీరు జనాల్లోకి వెళ్లిన తర్వాత మీకు మీ స్ట్రెంత్ తెలిస్తే బాగుంటుంది అని" అని చెప్పేసరికి "ఇది డాన్స్ షో నా పర్సనల్ షోనా" అని ఫైర్ అయ్యింది ముమైత్. "నిజంగా చెప్తున్నా ఇది మొత్తం ఎక్స్క్యూజెస్" అంది..."ఇది ఎక్స్క్యూజెస్" కాదు అని చెప్పింది ప్రియాంక. "నేను మీకు మేడం అని చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా" అంటూ ప్రియాంక అనేసరికి "వద్దు నువ్వు ఏటో చూస్తే నువ్వు నన్ను మేమ్ అని అంటున్నావ్" అనేసరికి "లేదు అలా ఎం లేదు..మీరు అంటున్నది కరెక్ట్ కాదు " అంటూ చెప్పింది ప్రియాంక. "నువ్వు నన్ను క్వయిట్ గా ఉండమంటున్నావ్ నువ్వెందుకు ఉండడం లేదు...ఇక్కడ డాన్స్ కావాలి..అంతకు మించి ఎక్కువగా మాట్లాడొద్దు " అంటూ ముమైత్ గట్టిగానే అరిచింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
