Krishna Mukunda Murari : కృష్ణకి మీరా మీద డౌట్ .. ఆదర్శ్ పెళ్ళి భాద్యత వారిద్దరిపైనే!
on May 17, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -471 లో.. కృష్ణ, ముకుంద, మురారి ఓ హోటల్లో కలిసి మాట్లాడుకుంటారు. ఆదర్శ్‌తో ఆ పెళ్లి ఆపమని ముకుంద.. కృష్ణ వాళ్లకు చెప్తుంది. కడుపులో బేబీ ఉండటం వల్ల ఎక్కువ సేపు కూర్చోలేకపోతున్నా అని మాట్లాడుతుంటే ఆయాసం వస్తుందని వెళ్లిపోతాను అని ముకుంద బయల్దేరుతుంది. కృష్ణ, మురారిలు ఏమీ అనలేకపోతారు.
మధు కథ రాస్తుంటే సంగీత అక్కడికి వస్తుంది. మధు తీయబోయే సినిమాలో తనని హీరోయిన్గా చేయమని అంటుంది. దానికి మధు వద్దు అనేస్తాడు. అప్పుడే రజిని వచ్చి.. మధుని లాగిపెట్టి కొట్టి.. ఏరా నా కూతురి భుజం మీద చేయి వేసి మాట్లాడుతావా.. ఎంత ధైర్యంరా నీకు. దాంతో సంగీత.. అమ్మా తెలుసుకోకుండా మాట్లాడకు. నేను యాక్టింగ్ చేస్తాను అంటే మధు బావ నువ్వు అమాయకురాలివి నీకు ఈ ఫీల్డ్ సెట్ అవ్వదు. చక్కగా పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా ఉండమని అన్నాడు. నువ్వు మాత్రం నన్ను ఆ సెకండ్ హ్యాండ్ గాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావని అంటుంది. నువ్వేం టెన్షన్ పడకు సంగీత ఎవరు ఏమనుకున్నా నువ్వు మంచి దానివి నీకు మంచే జరుగుతుంది. మీ అమ్మలో మార్పు వచ్చే వరకు ఇలాగే మీ అమ్మకు ఎదురు తిరుగుతూ ఉండు. ఆల్ ది బెస్ట్ రజినీ అత్త. ఇక నా కథ నేను రాసుకుంటానని మధు చెప్పేసి వెళ్ళిపోతాడు. మరోవైపు కృష్ణ, మురారి పెళ్ళి ఎలా ఆపాలని ఆలోచిస్తుంటారు. అదేసమయంలో మీరా తన గదిలో ఒంటరిగా కూర్చొని డైరీ రాస్తుంది. డైరీ రాస్తూ.. కృష్ణ నన్ను ఆరోజు చెంప మీద కొట్టావు. ఆ రోజే చెప్పా నువ్వు ఇంతకి ఇంత అనుభవిస్తావు అని.. నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్లే వరకు నీకు చుక్కలు చూపిస్తా చూడు. ఈ సారి పక్కాగా క్లియర్ ప్లాన్ చేస్తున్నాను అనుకుంటుంది. ఈ బిడ్డ కోసం కచ్చితంగా పెళ్లి ఆపుతారు. నేనే సరోగసీ మదర్ అని తెలిసిపోతుంది. కృష్ణ చేసిన నేరానికి ఇంటిలో ఉండనివ్వరు. ఒకవేళ ఉండనిచ్చినా ఎవరికీ ముఖం చూపించుకోకుండా తానే వెళ్లిపోతుంది. ఒకవేళ తానే ముకుంద అని బయట పడిన తాను ఉన్న పరిస్థితి వల్ల ఎవరూ ఏమీ అనరని అనుకుంటుంది. ఎప్పుడైతే వాళ్ల బిడ్డ నా కడుపులోకి వచ్చిందో అప్పుడే మొత్తం నా కంట్రోల్లోకి వచ్చేసింది. భవాని అత్తయ్య తర్వాత ఈ ఇంటి యజమాని స్థానం నాదే అని మీరా రాస్తుంది.
అసలు నా డౌట్ ఏంటి అంటే ఈ మీరా సరోగసీ మదర్‌గా ఉంటున్నా అని ముందే ఎందుకు చెప్పలేదు. చట్టపరంగా చెప్పలేదా.. కుట్ర పరంగా చెప్పలేదా. నాకు ఎందుకో అనుమానంగా ఉంది. మీరు కొంచెం సపోర్ట్ చేయండి కనిపెట్టేద్దామని మురారితో కృష్ణ అనగానే... ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒక్కటే. ఆదర్శ్ పెళ్లి ఆపడం, మీరా కడుపులో ఉన్న మన బిడ్డని జాగ్రత్తగా చూసుకోవడమని మురారి అంటాడు. భవాని దేవి పంతుల్ని పిలిపించి ఆదర్శ్, మీరాల పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తుంది. ముకుంద మనసులో కృష్ణని ఏడిపించడానికి ఇతన్ని భరించాల్సి వస్తుందని అనుకుంటుంది. మురారి, కృష్ణలు వస్తారు. పంతుల్ని చూసి షాక్ అవుతారు. దగ్గర్లో ఏ ముహూర్తాలు లేకుండా చూడాలని కృష్ణ కోరుకుంటుంది. మరోసారి భవాని పెళ్లి బాధ్యతల్ని కృష్ణ, మురారిల మీద పెడుతుంది. ఇక రేవతి.. కృష్ణ ప్రవర్తనలో తేడా ఉందని ఏదో జరుగుతుందని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read