Karthika Deepam2 : శౌర్యకి సీరియస్.. కార్తీక్ కాపాడగలడా!
on Oct 16, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. (karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -176 లో.. దీపని జ్యోత్స్న అందరి ముందు తిడుతుంది. నువ్వు నన్ను నా బావని విడదియ్యడం కోసమే ఇక్కడికి వచ్చావ్.. నా బావ కోసమే ఈ ఇంట్లో ఉంటున్నావని దీప గురించి తప్పుగా మాట్లాడుతుంటే దీప జ్యోత్స్న చెంపపగులగొడుతుంది. నన్నే కొడుతావా అని జ్యోత్స్న అనగానే.. కొట్టడం కాదు చెప్పుతో కొట్టాలని దీప అంటుంది. అసలు నీకేం కావాలి.. ఏం చేస్తే ఇలాంటివి మాట్లాడవని దీప అనగానే.. నువ్వు మా ఇంట్లో నుండి వెళ్ళిపోమని జ్యోత్స్న అంటుంది. దాంతో సరే అంటూ దీప కోపంగా ఇంటికి వెళ్తుంది.
దీని కోపం చూస్తుంటే ఇంట్లో నుండి వెళ్లేలా ఉంది. ఈ చెంప బావ కొట్టాడు.. ఈ చెంప ఇది కొట్టింది.. ఎవరితో అయిన చెప్తే పరువు పోతుంది.. ఛీ అందరితో దెబ్బలు తింటున్నానని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత దీప ఇంటికి వచ్చి బట్టలు సర్దుకొని శౌర్యని తీసుకొని వెళ్తుంటే.. అమ్మ కార్తీక్ కి చెప్తానని ఫోన్ తీసుకుంటుంది. వద్దని దీప తీసుకోబోతుంటే ఫోన్ కిందపడిపోతుంది. ఆ తర్వాత శౌర్యని తీసుకొని దీప వెళ్తుంటే.. పై నుండి జ్యోత్స్న, పారిజాతంలు చూస్తారు. ఇప్పుడు అది వెళ్లడం కరెక్ట్ కాదని పారిజాతం అంటుంది. అయిన పర్లేదు అది వెళ్ళాలని జ్యోత్స్న కోపంగా అంటుంది. దీప బస్ కోసం చూస్తుంటే దీపకి తెలియకుండా.. శౌర్య కార్తీక్ ఇంటికి వెళ్తుంది. దాంతో శౌర్య గురించి దీప వెతుకుతుంది. కార్తీక్ ఇంటికి శౌర్య వస్తుంది. కార్తీక్ వెళ్లడం చూసి కార్ వెనకాలే పరుగెడుతుంది. మరొకవైపు శౌర్య కోసం దీప కాంచన దగ్గరికి వస్తుంది. శౌర్య రాలేదని తెలిసి మళ్ళీ వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత శౌర్య రావడం చూసిన కార్తీక్ కార్ ఆపుతాడు. అప్పుడే శౌర్య కింద పడిపోతుంది. వెంటనే కార్ లో శౌర్యని పడుకోబెట్టుకొని తీసుకొని వెళ్తాడు. మరొకవైపు దీప శౌర్య గురించి చూస్తూ వెళ్తుంటే కాశీ ఎదరుపడతాడు. ఏమైంది అక్క అని అడుగగా.. శౌర్య కన్పించడం లేదని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read