Karthika Deepam2: మల్లెపూలు, పాలగ్లాస్ తో కార్తీక్ కోసం దీప ముస్తాబు.. శోభనం సెటప్!
on Dec 11, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం-2 (Karthika Deepam2)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-225 లో.. ఎప్పుడైతే దీపను చంపేస్తానని జ్యోత్స్న అంటుంది. పారిజాతం బెదిరిపోయినట్లుగా గుండెలపై చేయి వేసుకుని వింటుంది. అది నేనుండగా జరగదని దాసు స్పందిస్తూ.. కారు వెనుక నుంచి వాళ్లముందుకు వస్తాడు. దాసు రావడం, జ్యోత్స్న మాటలు విని స్పదించడం హైలైట్‌గా ఉంటుంది. అమ్మో ఎవరు వినకూడదో అతనే విన్నాడు.. ఇప్పుడు నేను నోరు తెరిస్తే ఇంట్లో అందరికీ దీప వారసురాలు అని చెప్పేస్తాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఏంటమ్మా అడ్డొచ్చిన వాళ్లను చంపేయమని నీ మనవరాలికి నేర్పిస్తున్నావా అని పారిజాతంతో దాస్ అంటాడు. నేనే నేర్పడం లేదు. కానీ నీ కొడుకు జీవితం కూడా దీనిలానే అయ్యి ఉంటే అప్పుడు తెలిసేది నీది బాధ. స్వప్నకు వేరే అబ్బాయితో పెళ్లి అయిపోయి ఉంటే.. అప్పుడు నీ కొడుకు కాశీ గాడు కూడా రోడ్లు పట్టుకుని తిరుగుతుంటే.. నా మనవరాలి బాధేంటో నీకు కొడుకు కాశీ గాడు కూడా రోడ్లు పట్టుకుని తిరుగుతుంటే.. నా మనవరాలి బాధేంటో నీకు తెలిసేది.. అయినా సుమిత్ర కూతురికి, కాంచన కొడుక్కి పెళ్లి కావాలన్నదే ఈ పారిజాతం సంకల్పం..దీన్ని ఆ దేవుడు కూడా మార్చలేడని పారిజాతం అంటుంది.
ఇక జ్యోత్స్న, పారిజాతానికి దాస్ వార్నింగ్ ఇస్తాడు. ఇదిగో ఇది కూడా ఒక్కోసారి నీలానే అర్థం కాకుండా మాట్లాడుతుందని పారిజాతం అనగానే.. త్వరలో అన్నీ అర్థమవుతాయమ్మా.. దీప జ్యోలికి పోవద్దు.. తొందరపడి ఏదీ చేయొద్దు.. జ్యోత్స్నా ముఖ్యంగా నీకే చెబుతున్నా.. దీప విషయాన్ని వదిలెయ్ అని దాస్ అంటాడు. మరోవైపు పాలగ్లాస్ తో దీప గదిలోకి వెళ్తుంది. శౌర్య ఏదని కార్తీక్ ని అడగ్గా.. తను వాళ్ళ నానమ్మ దగ్గర పడుకుంటుందంట.. నువ్వు ఆ పాలు తాగేసెయ్ అని కార్తీక్ అనగా.. ఎక్కువున్నాయి బాబు గారు అని దీప అంటుంది. సరే సగం సగం తాగుదామని కార్తీక్ అనగానే.. వీళ్ళంతా మమ్మల్ని కలపడానికే చూస్తున్నారని దీప మనసులో అనుకుంటుంది. పాలగ్లాసు అందుకోవడం కూడా చాలా ప్రత్యేకంగా చూపిస్తారు. ఇక పాల గ్లాసు అందుకున్నప్పుడు కార్తీక్ బాబు చేయి దీప వేళ్లకు తగలగానే చేతిని వెనక్కి తీసుకుంటుంది. అప్పుడే కార్తీక్ కళ్లల్లోకి దీప చూస్తుంది. వెంటనే కార్తీక్ కొంటెగా చూస్తూ.. ‘నువ్వు అన్నది నిజమే దీపా’అంటాడు. ‘ఏంటి బాబు’అంటుంది దీప. ‘పాలు ఎక్కువగానే ఉన్నాయి.. మొత్తం తాగడం కాస్త కష్టమే’ అంటాడు కార్తీక్. సగం ఇప్పుడు తాగండి.. సగం కాసేపు ఉండి తాగండి దీప అంటుంది. ఇక కార్తీక్ కి దీప పాలగ్లాస్ ఇవ్వడం హైలైట్ గా చూపిస్తారు. ఆ తర్వాత కార్తీక్ ని దీప పడుకోమని చెప్పగా.. నువ్వు పడుకోమని దీపని అంటాడు. అలా కాసేపు సరదాగా మాట్లాడతాడు.
సరే ఇప్పుడు చెప్పు నీ మనసుకు నచ్చింది చేయనా.. నా మనసుకి నచ్చింది చేయనా అని కార్తీక్ అనగా.. మీ మనసుకి నచ్చిందే చేయండి బాబు అని దీప వంటగదికి వెళ్లిపోతుంది. చేస్తాను నాకు నచ్చిందే చేస్తాను అని నవ్వుకుంటూ దీప ఇచ్చిన పాల గ్లాసుని చూసి నవ్వుకుంటాడు కార్తీక్. ఇక మరునాడు జ్యోత్స్న కార్తీక్‌ని ఆఫీస్‌లోనే ఉంచాలని మరిన్ని ఫైల్స్ ప్రభాకర్‌తో పంపించి.. వాటిని పూర్తి చేయాల్సిందే అని చెప్పిస్తుంది. అలా కార్తీక్ పని పూర్తి చేసేసరికి 14 గంటలు పైగా అయిపోతుంది. బిస్కెట్స్, జ్యూస్ ఇలా ప్రతీదీ కార్తీక్ క్యాబిన్‌కి తెచ్చి.. కొంటెగా చూస్తూ జ్యోత్స్న తెగ మురిసిపోతుంది.. ఈరోజు దీపను బావకు పద్నాలుగు గంటలు దూరం చేశాను.. ఈ రోజుకి చాలని పొంగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read