Karthika Deepam2 : దీప తాళికి విలువ కట్టిన జ్యోత్స్న.. కార్తీకదీపం-2 లో సూపర్ ట్విస్ట్!
on Nov 15, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -203 లో...శౌర్యకి అనసూయ జుట్టు వేస్తుంది. కుదురుగా ఉండవ్ ఎంటని అనసూయ.. ఇక్కడ ఎవరు కుదరుగా ఉండడం లేదని శౌర్య అంటుంది. అప్పుడే దీప వస్తుంది. దానికి సమాధానం చెప్పమని అనసూయ అనగానే.. దానికి సమాధానం చెప్పేంత చదువు చదవలేదని దీప అంటుంది. నాకు నడుం నొప్పిగా ఉంది నీ చాప ఇస్తావా అని అనసూయ అంటుంది. దాంతో శౌర్య వంక కోపంగా చూస్తుంది దీప. నేనేం చెప్పలేదని శౌర్య అంటుంది. అప్పుడే పారిజాతం వస్తుంది.
అసలు నీకు ఈ రెండో పెళ్లి దాన్ని కోడలిని ఎలా చేసుకున్నావ్ అంటూ కాంచనని తిడుతుంది. అలా అనసూయ, దీపలని కలపి తిడుతుంది. అసలు దీన్ని పెళ్లి చేసుకోవడమే వింత అంటే అందులో అందరికి తెలిసేలా చెయ్యడం ఇంకో వింత.. నీకు కాళ్ళే కాదు బుర్ర కూడ పని చెయ్యడం లేదా కాంచన అని అనగానే.. అప్పుడే కార్తీక్ కోపంగా పారు అంటూ అరుస్తాడు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే ఊరుకోను. నిన్ను తాతయ్య ఏడేళ్ల కొడుకుతో ఉంటే పెళ్లి చేసుకోలేదా.. నేను దీప నీ చేసుకుంటే అలా అంటున్నావ్.. నువు చేస్తే రైట్ దీప చేస్తే తప్పా అని కార్తీక్ అంటాడు అయిన నాది చట్టబద్దంగా జరిగింది. మీలా కాదని పారిజాతం అనగానే.. అనసూయ తనని గేంటేయ్ అని కాంచన అంటుంది. కార్తీక్ కూడా అలాగే అంటాడు. దంతో మీ సంగతి చెప్తానని పారిజాతం వెళ్తుంది. తన సంగతి తాతయ్యకి చెప్తానని కార్తీక్ అంటే కాంచన వద్దని అంటుంది.
శౌర్యని కార్తీక్ స్కూల్ కి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత దీపకి జ్యోత్స్న ఫోన్ చేసి కలవాలని అంటుంది. ఇద్దరు ఒక చోట కలుస్తారు. నేను తాళి బొట్టు కోసం షాప్ కి వెళ్తే.. రెండు లక్షల్లో మంచిది వస్తుంది. డబ్బుతో అన్నీ కొనొచ్చు నాకు నీ తాళి కావాలి. ఎంత కి ఇస్తావ్ ఇదిగో బ్లాంక్ చెక్ నీకు డబ్బులు ఇచ్చి బస్ ఎక్కిస్తాను.. నీ కూతురిని నా కూతురులా చూసుకుంటా ఈ డీల్ ఓకేనా అని జ్యోత్స్న అనగానే ఒకే అని దీప అనగానే జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read