Karthika Deepam2 : సవతి కూతురు కావాలా.. జ్యోత్స్నకి నిజం చెప్పేసిన పారిజాతం!
on Oct 5, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -167 లో.... బావ ఇంటికి వచ్చి తాతయ్యతో మాట్లాడి వెళ్ళాడు. అసలు నా గురించి గాని పెళ్లి గురించి గానీ ఏం మాట్లాడలేదని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. బావ ఇక్కడికి వచ్చే ముందు.. దీపని కలిశాడా అని జ్యోత్స్న అంటుంది. కలిసే ఉండి ఉంటాడని పారిజాతం అంటుంది. ఒకటి చెప్పు అసలు బావ మనసులో నేను ఉన్నానా అని జ్యోత్స్న అనగానే.. ఒకటి చెప్తాను.. నువ్వేం అనవుగా అంటూ అసలు కార్తీక్ మనసులో నువ్వు లేవు అనే విషయం పారిజాతం చెప్పగానే.. జ్యోత్స్న షాక్ అవుతుంది. నీకెలా తెలుసని జ్యోత్స్న అడుగుతుంది.
నాకు మీ బావ లండన్ నుండి వచ్చాకే చెప్పాడు. జ్యోత్స్నని మరదలుగా తప్ప అసలు భార్యగా చూడలేను అన్నాడని పారిజాతం అంటుంది. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని జ్యోత్స్న అనగానే.. నువ్వు తట్టుకుంటావో లేదో అని పారిజాతం అంటుంది. మరి ఇప్పుడు ఎందుకు చెప్పావని జ్యోత్స్న అంటుంది. ఇంతకన్నా పెద్ద విషయాలు తెలిసి తట్టుకున్నావని పారిజాతం అంటుంది. బావకి ఇష్టం ఉన్నా లేకున్నా నా పెళ్లి బావ తోనే జరగాలి.. బావ ఇష్టంతో నాకు సంబంధం లేదని జ్యోత్స్న అంటుంది.
మరోవైపు స్వప్న మొదటిసారిగా అత్తింట్లో దీపం పెడుతుంటే.. తన కోసం ఎవరైనా వస్తారని చూస్తుంది. కావేరి, శ్రీధర్ వస్తారు.. అమ్మ నువ్వు ఒక్కదానివే రా అంటూ శ్రీధర్ పై కోప్పడుతుంది స్వప్న. అప్పుడే దీప, కార్తీక్, కాంచనలు వస్తారు. వాళ్ళకి ఎదరుగా స్వప్న వెళ్లి మాట్లాడుతుంది. అందరు బానే ఉన్నారు.. వాడికి తండ్రి వద్దు.. చెల్లి కావాలి.. తనకేమో భర్త వద్దు.. సవతి కూతురు కావాలని శ్రీధర్ అనుకుంటాడు. అందరు లోపలికి వస్తారు. శ్రీధర్, కావేరి లు బయటే వుంటారు. స్వప్నకి కాంచన చీర, సారే తీసుకొని రాలేదని డబ్బులు ఇస్తుంది. అందరి దగ్గర స్వప్న ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత శ్రీధర్ , కావేరి లు వెళ్లిపోతుంటే.. అమ్మ నువ్వు ఒక్కదానివే ఆశీర్వాదించమని స్వప్న అంటుంది. దాంతో శ్రీధర్ కోపంగా కార్ ఎక్కుతాడు. అప్పుడే దీప వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read