మా పెళ్లి త్వరలోనే ....
on Jul 8, 2024
జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో "ఆస్క్ మీ ఏ క్వశ్చన్ " పేరుతో ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయింది. దాంతో ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చింది ఫైమా. "పెళ్ళెప్పుడు అక్కా" అని అడిగేసరికి "త్వరలో" అని చెప్పింది. "మీరిద్దరూ క్యూట్ పెయిర్" అనేసరికి "థాంక్యూ సో మచ్" అని చెప్పింది. "మీ లవ్ మొదలై ఎన్నేళ్లు అవుతుంది అక్క" అని అడిగేసరికి "నా యూట్యూబ్ లో నెక్స్ట్ క్లియర్ గా చెప్తాను" అని చెప్పింది.
"ప్రవీణ్ అన్న వాళ్ళ ఇంటి పేరేంటి" అని అడిగారు "బాడావత్" అని అంది. "మీరు మా ఇద్దరి గురించి క్లారిటీ కావాలంటే మీరు అడగాలి అనుకున్నవి అడగండి..వ్లాగ్ లో క్లారిటీ ఇస్తాను" అని చెప్పింది. జబర్దస్త్, బిగ్ బాస్ ద్వారా ఫైమా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఫైమా, ప్రవీణ్ ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకుంటారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొంతకాలంగా ఫైమా, ప్రవీణ్ ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు లేవు. ప్రవీణ్ తో బ్రేకప్ కు సంబంధించి ఫైమా నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేసింది.