Guppedantha Manasu : మరదలి మీద అరిచేసిన బావ.. ఇంతకీ అతనెవరు?
on Jul 6, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1119 లో..... వసుధారని రంగా పొగరు అని అంటాడు. అవును నాకు పొగరే.. ఇప్పుడేం అంటారని వసుధార దబాయిస్తుంది. దాంతో మేడమ్ గారు నేనేదో కోపంలో అన్నానని రంగా అంటాడు. అదంతా చూస్తుంటారు రంగా ఫ్రెండ్ ఇంకా సరోజ.. ఇది అన్నంత పని చేసేలా ఉంది పదిహేను రోజుల్లో బావతో నేనే రిషి సర్ అని చెప్పిస్తానంది.. ఇప్పుడేం చెయ్యాలి నా బావని నాకు కాకుండా చేసేలా ఉందని సరోజ అనుకుంటుంది.
ఆ తర్వాత మను దగ్గరికి ఏంజిల్ వస్తుంది. అసలు ఈ వసుధార మేడమ్ గారు ఎక్కడికి వెళ్లారో అర్థం కావడం లేదు.. రిషి, వసుధారల కోసం మహేంద్ర సర్ చాలా బాధపడుతున్నారని మను అంటాడు. రిషి ఉన్నాడని వసుధార చెప్పితే అందరు తన మాట నమ్మి సపోర్ట్ గా ఉంటే బాగుండు.. ఇలా వెళ్లి ఉండేది కాదని ఏంజిల్ అంటుంది. అప్పుడే దేవయాని, శైలేంద్ర వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇది కొందరికి పార్క్ అయిపోయిందని దేవయాని అంటుంది. నీకు ఇక్కడేం పని.. మీ బావ మరదళ్ళ సరసలు ఏవైనా ఉంటే బయట చూసుకోండి.. ఇది కాలేజీ అని దేవయాని అంటుంది. కొంచం జాగ్రత్తగా ఉండు.. మీ అత్తలాగా పెళ్లి కాకుండానే తల్లి అవుతావు.. ఎక్కడికి పోతాయి నాన్న బుద్దులు అని మనుని దేవయాని అంటుంది. కొంచెం మర్యాదగా మాట్లాడండి అని ఏంజిల్ అంటుంది. పాపం ఇంత వయసు వచ్చిన తండ్రి ఎవరో తెలియదని మనుని బాధపెట్టలా దేవయాని మాట్లాడుతుంది. మీరు అన్న మాటలు మొత్తం మా అత్తయ్యకి చెప్తానని ఏంజిల్ అనగానే.. చెప్పు మీ అత్తయ్య ఎవరు? ఇక్కడ బయపడేవాళ్లు లేరని దేవయాని అంటుంది. వాళ్ళ మాటలు తట్టుకోలేక మనుని ఏంజిల్ తీసుకొని వెళ్తుంది.
మరొకవైపు సరోజ పెద్దావిడ దగ్గరికి వచ్చి.. అసలు బావ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు.. ఆ వసుధార చెయ్ పట్టుకున్నాడంటూ పెద్దావిడకి చెప్తూ కోప్పడుతుంది. అప్పుడే వసుధారని తీసుకొని రంగా వస్తాడు. ఆ తర్వాత సరోజ, వసుధారల మధ్య గొడవ జరుగుతుంది. నా బావ రంగా అని సరోజ. లేదు రిషి సర్ అని వసుధార అంటుంది. నువు ఇక్కడ నుండి వెళ్లిపోవే అని సరోజ వసుధారని అనగానే.. సరోజ పైకి రంగా అరుస్తాడు. వసుధారని లోపలికి పంపిస్తాడు. నేను నీకు కాబోయే భార్యని అని సరోజ అనగానే.. నేను నీకు చెప్పనా అని రంగా అంటాడు. దాంతో సరోజ బాధపడుతు.. నేను చిన్నప్పటి నుండి బావే నా భర్త అనుకున్నానని పెద్దావిడతో అంటుంది. నువ్వు వాడికి కోపం వచ్చేలా ఎందుకు ప్రవర్తిస్తున్నావంటూ పెద్దావిడ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read