Eto Vellipoyindhi Manasu : ఊహకందని మలుపులతో ఎటో వెళ్లోపోయింది మనసు.. మాస్క్ వేసుకున్నది అతనే!
on Oct 3, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -216 లో... సీతాకాంత్, రామలక్ష్మి కోసం మల్లెపువ్వులు తీసుకొని వస్తాడు. శ్రీలత వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటారు. వాళ్లకు తెలియకుండా తీసుకొని వెళ్ళాలని సీతాకాంత్ అనుకుంటాడు. అలా తీసుకొని వెళ్తుంటే అందరు చూస్తారు. ఆ తర్వాత బావగారు లుంగీ కట్టుకొని అక్క దగ్గరికి వెళ్తారంటూ శ్రీలతకి శ్రీవల్లి చెప్తుంది. రామలక్ష్మి, సీతకాంత్ లు హ్యాపీగా ఉన్నట్లు ఉహించుకుంటుంది. ఈసారి నా లేడీవిలన్ తెలివితో వాళ్ళని విడగొడుతానని శ్రీవల్లి అంటుంది. నువ్వేం చెయ్యనవసరం లేదు.. ఏం చెయ్యాలో నాకు తెలుసంటూ శ్రీలత అంటుంది.
ఆ తర్వాత శ్రీలత ఆలోచిస్తుంటే.. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఏం ఆలోచిస్తున్నారు నన్ను సీతా సర్ ని విడదీసి ఆస్తులు అన్ని కొట్టేయలని ప్లాన్ చేస్తున్నారా అని రామలక్ష్మి అంటుంది. నిన్ను సీత నుండి వేరు చెయ్యడం కాదు.. మళ్ళీ జీవితంలో కలవకుండా చేస్తానని శ్రీలత అంటుంది. సీతాకాంత్ రావడం గమనించి.. నువ్వు సీతా ఎప్పుడు అన్యోన్యంగా ఉండడానికేం చేయడానికైనా నేను సిద్ధమని శ్రీలత అనగానే.. ఇలా మాట్లాడుతుంది ఏంటని రామలక్ష్మి అటు వైపు చూసేసరికి సీతాకాంత్ ఉంటాడు. సీతాకాంత్ వచ్చి.. ఏంటి అమ్మ పెద్ద కోడలితో ఎదో మాట్లాడుతున్నావని అడుగుతాడు. నీ గురించే చెప్తున్నా నిన్ను బాగా చూసుకోమని చెప్తాడు. ఇద్దరు ఎప్పుడు కలిసి మెలిసి ఉండమని చెప్తున్నానని శ్రీలత అంటుంది. అవునా మన గురించి చాలా ఆలోచిస్తుందని శ్రీలత గురించి వెటకారంగా మాట్లాడుతుంటుంది రామలక్ష్మి. ఆ తర్వాత సీతాకాంత్ మల్లె పువ్వులు పట్టుకొని రామలక్ష్మి కోసం గదిలో వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. తను ఆ పువ్వులు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీతాకాంత్ స్వయంగా రామలక్ష్మికి మల్లె పువ్వులు పెడతాడు.
ఆ తర్వాత సీతాకాంత్ నిద్రపోయాక రామలక్ష్మి పెన్సిల్ తో తనకి కన్పించిన రౌడీ బొమ్మని గీస్తుంది. అది తీసుకొని వెళ్లి సిరికి చూపిస్తుంది. ఇతన్ని ఎక్కడైనా చూసావా అని రామలక్ష్మి అడుగుతుంది. నాకు గుర్తు రావడం లేదు వదిన అని సిరి అంటుంది. ఆ బొమ్మని శ్రీలత దూరం నుండి చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి మళ్ళీ వెళ్లి మాస్క్ తో ఉన్న రౌడీ బొమ్మ గీస్తుంది. అది శ్రీలత చూసి భయపడుతుంది. ఆ తర్వాత సిరికి రామలక్ష్మి చూపిస్తుంది. ఇతనే వదిన నా నగలు లాక్కోవాలని ట్రై చేసిందని సిరి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read