ఎవరి అంచనాలకి అందకుండా దూసుకెళ్తున్న కథ.. యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్!
on Jun 27, 2024
ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ మొదలైన కొన్ని రోజులకే అత్యధిక ఫ్యాన్ బేస్ తెచ్చేసుకుంది. స్టార్ మా టీవీలోని టాప్ సీరియల్స్ లో ఈ సీరియల్ ఒకటిగా నిలిచింది. ఈ సీరియల్ బాగుండటానికి కారణం మంచి కథ. ఏ సీరియల్ అయిన కథ బాగుంటేనే సరైన హిట్ లభిస్తుంది. ఈ సీరియల్ లో సీతాకాంత్, రామలక్ష్మిల జంటకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
నిన్న మొన్నటిదాకా సిరి, ధనల ఇష్యూ సాగగా.. నేటి ప్రోమోలో అభి ఏకంగా ఇంటికే వస్తాడు. దాంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. మాణిక్యం వన్ మ్యాన్ షోగా సీతాకాంత్ ఎత్తులు ఓవైపు.. శ్రీలత తెగింపు మరోవైపు సాగుతుంది. గత జన్మలో ప్రేమించుకొని విడిపోయిన రామలక్ష్మి, సీతాకాంత్.. ఈ జన్నలోనైనా కలుస్తారా లేదా అనే కథాంశంతో మొదలైన ఈ కథ.. మొదటి ఎపిసోడ్ నుండి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అందులోను ఇద్దరి భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు.. అయితే రామలక్ష్మికి ముందుగానే అభి అనే బాయ్ ఫ్రెండ్ ఉండటంతో కథలో మెలిక మొదలైంది. కొన్ని ఎపిసోడ్ల ముందు అభి నిజస్వరూపాన్ని శ్రీలత నిజస్వరూపాన్ని రామలక్ష్మి తెలుసుకుంటుంది. అప్పటి నుండి కథ పూర్తిగా మలుపు తిరిగింది.
సీతాకాంత్ వాళ్ళ సవతి తల్లి శ్రీలత చేసే కుట్రలు తెలుసుకున్న రామలక్ష్మి ఎలాగైనా తన భర్తని కాపాడాలని అనుకుంటుంది. దాంతో మెల్లి మెల్లిగా ఇల్లుని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటుంది రామలక్ష్మి. అయితే నిన్నటి ఎపిసోడ్ లో రోజు సీతాకాంత్ ఉదయం లేవగానే సీతాకాంత్ గుడ్ మార్నింగ్ చెప్తూ దర్శనమిస్తుంది. ఇక సీతాకాంత్ సంబ్రమాశ్చర్యానికి గురవుతాడు. తనకి బంగారం అంతా అలకరించి మురిసిపోతాడు సీతాకాంత్. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో.. సీతాకాంత్ కి ముసలాయన ఫోన్ చేసి.. రామలక్ష్మి కి బాలేదని చెప్తాడు. దాంతో సీతాకాంత్ కంగారుగా ఇంటికొస్తాడు. ఇక ఇంటికొచ్చేసరికి ఇంట్లోని వాళ్ళంతా పూలతో అలంకరించి, గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్తారు. రామలక్ష్మి బాగానే ఉందని కంగారుపడొద్దని సీతాకాంత్ తో ముసలాయన చెప్పగా.. సరేనని కూల్ అవుతాడు. ఉదయం రామలక్ష్మి మొహం చూశాను.. ఆఫీస్ కి వెళ్లగానే గుడ్ న్యూస్ అని సీతాకాంత్ అంటాడు. "తను నా జీవితంలోకి అడుగుపెట్టిన వేళా విశేషమే నాకు ఈ అవార్డు రావడానికి కారణం" అని రామలక్ష్మిని సీతాకాంత్ పొగుడుతాడు. దాంతో శ్రీలత షాక్ అవుతుంది. మరి నేటి ఎపిసోడ్ లో శ్రీలత ఏం చేయనుంది? రోజురోజుకి దగ్గరవుతున్న సీతాకాంత్, రామలక్ష్మిల మధ్య దూరం శ్రీలత పెంచగలదా లేదా తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే.
Also Read