Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ ప్లాన్ లో అభి కీలుబొమ్మలా మారనున్నాడా!
on May 17, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -98 లో.. సిరి కోసం సీతాకాంత్ గొలుసు తీసుకొని వస్తాడు. కానీ ధనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇచ్చాడని సిరి కోపంగా ఉంటుంది. దాంతో అది అర్థం చేసుకున్న సీతాకాంత్.. అందరు నన్ను తప్పుగా అనుకుంటారు. ఆఫీస్ రూల్స్ తప్పినట్టు ఉంటుంది. ధన ఒకరి కింద జాబ్ చెయ్యడమేంటమ్మ.. మీరు ఇద్దరు చదువుకున్న వాళ్ళు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయండి. దానికి కావలిసిన పెట్టుబడి ఎంప్లాయిస్ మొత్తం నేను ఏర్పాటు చేస్తానని అనగానే.. సిరి, ధన ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఆ తర్వాత సిరి, ధనలతో బిజినెస్ స్టార్ట్ చేయమనడం శ్రీవల్లి విని.. సందీప్ కి వెళ్లి చెప్తుంది. మీరు కూడా మీ అన్నయ్తో బిసినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి డబ్బులు ఇవ్వమని అనగానే.. డబ్బులు అడుక్కునే పరిస్థితి నాకేంటని.. కొన్ని రోజుల్లో నేనే ఈ ఆస్తి, బిజినెస్ కి వారసుడిని కాబోతున్నానని సందీప్ అనగానే శ్రీవల్లి మురిసిపోతుంది. ఆ తర్వాత సీతాకాంత్ రెడీ అయి అభికి ఫోన్ చేసక.. చెప్పిన ప్లేస్ కి రమ్మని చెప్తాడు. దానికి అభి సరే అంటాడు... నువ్వు ఏం ప్లాన్ చేసావో నాకు తెలుసు.. నీ ప్లాన్ ని నేను తిప్పికొడతానని అభి అనుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మికి అభి ఫోన్ చేసి.. నేనొక బిజినెస్ స్టార్ట్ చేస్తున్న ఆ విషయం ఎవరికి చెప్పకు సీతాకాంత్ సర్ కి కూడా చెప్పకు అని అభి అనగానే.. సీతాకాంత్ సర్ మనకు ఎంత హెల్ప్ చేస్తున్నాడు.. అలా అంటున్నావేంటని రామలక్ష్మి అంటుంది. ముందు ఆ సీతాకాంత్ విలువను నీ దృష్టిలో తగ్గించాలని అభి అనుకుంటాడు.
ఆ తర్వాత సీతాకాంత్ బయటకు వెళ్తు.. రామలక్ష్మిని ఎదురురమ్మని చెప్తాడు. అదంతా శ్రీలత, సందీప్ ఇద్దరు చూస్తారు.. ఆ తర్వాత సీతాకాంత్ ఫేక్ రెసాట్ ఓనర్స్ ని ఒక చోటుకి రమ్మంటాడు. కాసేపటికి అక్కడికి అభి కూడా వస్తాడు. మీరు సంతకాలు చేస్తే ఆ రెసాట్ అభి పేరుపై మారుతుంది. ఆ తర్వాత ఈ డబ్బులు తీసుకోండని సీతాకాంత్ చెప్తాడు. వాళ్ళు సంతకాలు చేస్తుంటే. వద్దని వాళ్లని పంపిస్తాడు అభి. ఇదంతా ఫేక్ అని తెలుసు.. నాకు డబ్బులు ముఖ్యమంటూ డబ్బులు తీసుకొని అభి వెళ్తుంటాడు. సీతాకాంత్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి సైలెంట్ గా ఉంటాడు. అదంతా శ్రీలత, సందీప్ ఇద్దరు చూస్తుంటారు.. ఆ తర్వాత అభి డబ్బులు తీసుకొని వెళ్తుంటే.. కొంతమంది అతన్ని చుట్టుముట్టి చేతిలో ఉన్నవి ఏంటి ఓపెన్ చేసి చూపించు అని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read