ENGLISH | TELUGU  
Home  » TV News

Eto Vellipoindi Manasu : అత్తకి తగ్గ కోడలు.. మన బంధాన్ని ఎవరూ విడదీయలేరు!

on Nov 24, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -261 లో.. రామలక్ష్మి ఆస్తులపై ప్రేమతో నన్ను మోసం చేసి ఆస్తులు రాయించుకుందని సీతాకాంత్ తనపై కోపంగా ఉంటాడు. దాంతో ఇదే కరెక్ట్ టైమ్.. వాళ్ళ ఇద్దరిని విడగొట్టడానికని శ్రీలత ప్లాన్ లు వేస్తుంది. శ్రీలత, సందీప్, శ్రీవల్లీలని ఇంట్లో పనులు చెయ్యండి. ఆస్తులు ఇవ్వనంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది. దాంతో ఏం చెయ్యలేక పనులు చేస్తుంటారు.

సీతాని బాధపెట్టి దూరం చేసుకుంటున్నావని సిరి, పెద్దాయన అంటారు. నన్ను అర్థం చేసుకోండి.. ఏం చేసిన ఆయన కోసమే.. నాపై నమ్మకం ఉంటే కాస్త ఓపిక పట్టమని చెప్తుంది. ఇక ఇంటిపనులు తప్పించుకోవాలని డాక్టర్ కి ఫోన్ చేసి తను చెప్పినట్టు చెప్పమని సందీప్, శ్రీవల్లికి శ్రీలత చెప్తుంటే.. రామలక్ష్మి విని మీ సంగతి చెప్తానని అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీలత కళ్ళు తిరిగినట్టు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడే డాక్టర్ వచ్చి తనకి బాలేదు బీపీ ఎక్కువ అయిందంటూ చెప్తాడు. చూసావా నా తల్లికి పనులు చెప్పి ఎలా చేసావో అంటూ రామలక్ష్మి పై సీతాకాంత్ కోప్పడతాడు.

ఆ తర్వాత రామలక్ష్మి ఒక ఫైల్ తీసుకొని వచ్చి.. ఇది వారం కిందటి అత్తయ్య రిపోర్ట్స్ చూడండి అని రామలక్ష్మి ఆ డాక్టర్ కి ఇస్తుంది. అందులో చెక్ ఉంటుంది. నీకు ఎంత కావాలో అంత రాసుకోమని రామలక్ష్మి అందులో రాస్తుంది. అది చూసి డాక్టర్ టెంప్ట్ అయి ఈవిడ బాగుంది. ఇప్పటివరకు చేసిన పనులు కంటిన్యూ చేయండి అని డాక్టర్ అనగానే.. శ్రీలత వాళ్లు షాక్ అవుతారు. సీతాకాంత్ సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఆ రామలక్ష్మి కావాలనే ఇలా చేసిందని వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత రామలక్ష్మి పడిపోతుంటే సీతాకాంత్ పట్టుకుంటాడు. అప్పుడే రామలక్ష్మి తాళి సీతాకాంత్ చైన్ ముడిపడితాయి. మన బంధాన్ని ఎవరు విడదియ్యలేరని రామలక్ష్మి అంటుంది. అదంతా చూసి శ్రీవల్లి.. శ్రీలత దగ్గరికి వచ్చి చెప్తుంది. నాకు తెలుసు మేమ్ హ్యాపీగా ఉంటే మీరు చూడలేరని అనుకుంటూ రామలక్ష్మి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.