సవతి తల్లి మాయలో కొడుకు.. భార్య తెలిసేలా చేయగలదా!
on Nov 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -260 లో......సీతాకాంత్ ఇంటికి వచ్చేసరికి వంట చేసి చెయ్యి కాల్చుకున్నట్లు శ్రీలత సీన్ క్రియేట్ చేస్తుంది. దాంతో సీతాకాంత్ రామలక్ష్మిపై పట్టరాని కోపంతో ఉంటాడు. అసలు రామలక్ష్మి ఎందుకిలా చేస్తున్నావ్.. నాతల్లిని కష్టపెడుతున్నావని సీతాకాంత్ అంటాడు. పదా అమ్మ మనం ఇంట్లో నుండి వెళ్ళిపోదాం.. ఈ ఆస్తులు లేకుండా నువ్వు నాతో ఉండు.. అప్పుడు కొంతమందికి నువ్వేంటే ఏంటో అర్ధమవుతుందని సీతాకాంత్ అంటాడు.
దాంతో వద్దు సీతా.. తనకి ఆస్తులు అంటే ఇష్టం అయింది. దాంతో మమ్మల్ని ఇలా కష్టపెడుతుంది కానీ నువ్వు అంటే తనకి ఇష్టమని శ్రీలత అంటుంది. చూసావా ఇప్పటికి కూడా మా అమ్మ మనం కలిసి ఉండాలని ఆలోచిస్తుందని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి శ్రీలత వెళ్లి.. ఏంటి రామలక్ష్మి నేను అనుకున్నది జరగాలంటే కొంచెం తగ్గాను చూసావ్ కదా.. సీతా ఎలా అంటున్నాడో.. ఆ ఆస్తులు ఇస్తే ఇదంతా ఉండదు కదా అని శ్రీలత అనగానే.. ఆస్తులు లేకపోతేనే ఇలా ఉన్నారు.. ఇక ఆస్తులు మీ చేతికి వెళ్తే సైలెంట్ గా ఎలా ఉంటారని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత శ్రీలత ఎవరికో ఫోన్ చేసి రామలక్ష్మి గురించి చెప్తుంది.
ఆ తర్వాత సీతాకాంత్ ధ్యానం చేస్తుంటే రామలక్ష్మి పువ్వులు విసురుతుంది. అది చూసి ఎందుకు ఇలా చేస్తున్నావంటూ చిరాకు పడతాడు. రామలక్ష్మి పడిపోతుంటే సీతాకాంత్ పట్టుకుంటాడు. ఆ తర్వాత వదిన ఎందుకిలా చేస్తుందో కనుక్కో తాతయ్య లేదంటే మనం కలపాలనుకున్నా కలవనంత దూరం అవుతారని సిరి అంటుంది. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఎందుకిలా చేస్తున్నావ్.. సీతా బాధపడుతున్నాడని పెద్దాయన, సిరి అడుగుతారు. నేనేం చేసిన సీతా సర్ కోసమేనని రామలక్ష్మి అంటుంది. అదేంటో మాకు చెప్పమని పెద్దాయన అంటాడు. మీరు చెప్పిన నమ్మారు. నాపై నమ్మకం ఉంటే కొన్ని రోజులు ఆగండి అంతా తెలుస్తుందని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read