యాక్సిడెంట్ అయ్యేలా ప్లాన్ చేసిన సందీప్.. వారికి ఏం జరగిందంటే!
on Sep 7, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -195 లో...రామలక్ష్మి, సీతాకాంత్ లు బయటకు వెళ్తున్నారనుకొని సందీప్ కార్ బ్రేక్ ఫెయిల్ చేస్తాడు. రామలక్ష్మి ఒక్కతే వెళ్తుంటే.. ఏంటి అన్నయ్య వెళ్లట్లేదా పర్లేదులే రామలక్ష్మి మిగలదనుకుంటాడు.
ఆ తర్వాత జర్మనీ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారన్నావ్ ఏంటి ఇంకా చెయ్యలేదని సీతాకాంత్ అంటాడు. పర్లేదులే చేస్తారులే ఇక్కడ మనం తప్ప ఎవరు లేరంటూ నందిని అంటుంది. మరొకవైపు సీత సర్ నా పక్కన ఉంటే నా ప్రేమ విషయం చెప్పేదాన్ని అని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత కాలం ఒక్కసారి వెనక్కి వెళ్తే బాగుండు.. మనం ఎంత సంతోషంగా ఉన్నామని నందిని అనగానే.. అది గతం అని సీతాకాంత్ అంటాడు. గతం అనకు నాకు అది మధుర జ్ఞాపకమని నందిని అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ అదంతా చిరాకుగా ఫీల్ అయ్యి బయటకు వస్తాడు.
మరొకవైపు రామలక్ష్మికి కార్ బ్రేక్ ఫెయిల్ అయిందని తెలుస్తుంది. అప్పుడే సీతాకాంత్ ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ తీసుకునే లోపే ఫోన్ కింద పడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ వేరే కార్ లో వెళ్తాననుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి బ్రేక్ పని చెయ్యక ఒక చోట కార్ ఆక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత నా కార్ లో వెళ్ళమని సీతాకాంత్ తో నందిని చెప్పగా.. అక్కర్లేదంటు సీతాకాంత్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి రామలక్ష్మి కాఫీ తీసుకొని రా అంటూ పిలుస్తాడు. ఎంత పిలిచినా రామలక్ష్మి రాకపోయేసరికి అప్పుడే సీతాకాంత్ కిందకి వెళ్లి అందరిని అడుగుతాడు. నీతో మార్నింగ్ వెళ్ళింది ఇంటికి రాలేదని చెప్తారు. దాంతో సీతాకాంత్ కంగారుపడుతాడు.
ఆ తర్వాత రామలక్ష్మి దెబ్బలతో ఇంటికి వస్తుంది. దాంతో కంగారుగా ఏం జరిగిందని సీతాకాంత్ అడుగుతాడు. రామలక్ష్మిని గదిలోకి తీసుకొని వెళ్లి కట్టు కడతాడు. జరిగింది అడిగి తెలుసుకుంటాడు. రెస్ట్ తీసుకోమంటూ బయటకు వస్తాడు. రామలక్ష్మి, సీతాకాంత్ లు బయటకు వెళ్తుంటే.. నందిని వద్దన్న విషయం గుర్తుకు తెచ్చుకొని ఇదంతా కావాలని నందిని చేసి ఉంటుందని కోపంగా తన దగ్గరికి బయల్దేర్తాడు. ఆ తర్వాత శ్రీలత, శ్రీవల్లిలతో ఇదంతా మీరే చేశారని రామలక్ష్మి కోప్పడగా.. మేమ్ చెయ్యలేదని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read