రష్మి ని ముద్దు పెట్టుకోవాలని ఉంది అన్న ఇమ్మానుయేల్
on Dec 3, 2024
వర్ష ఇమ్మానుయేల్ స్కిట్ అంటే చాలు పొదలు, తోటలు, పంపు సెట్లు ఇవే ఉంటాయి. ఇక జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో వర్ష ఇమ్మానుయేల్ జోడి కలిసి స్కిట్ వేసింది. "రాత్రంతా గోంగూర తోట దగ్గర వెయిట్ చేశా ఇమ్ము నీకోసం రాలేదేంటి అని వర్ష అడిగేసరికి నేను మన తోట దగ్గర వెయిట్ చేస్తున్నా ఇంతకు నువ్వు ఏ తోటకు వెళ్ళావే" అని అనుమానంతో అడిగేసరికి "నేను శివాజీ గారి తోటకు వెళ్లాను" అని చెప్పింది వర్ష. ఆ మాటకు శివాజీ స్పందించాడు.
"మా దగ్గర తోటలు లేవమ్మా ఓన్లీ పంపు సెట్లే" అన్నాడు. దానికి ఇమ్ము - వర్ష నవ్వేశారు. ఇక వర్ష టాపిక్ డైవర్ట్ చేసి యాంకర్ రష్మీకి బిస్కెట్స్ వేసింది. "రష్మీ అక్క చూడండి ఈ వయసులో అంత చిన్న పిల్లలా ఎలా కనిపిస్తుందండి" అనేసరికి "ఏమోనే వచ్చినప్పుడు చూడగానే బుగ్గలు పట్టుకుని కొరికేసి ముద్దులు పెట్టేసుకోవాలనిపించింది నాకు కూడా" అనేసరికి రష్మీ ఫుల్ ఫైర్ ఫేస్ పెట్టింది. దాంతో టాపిక్ ని ఖుష్భు మీదకు డైవర్ట్ చేసింది .."ఈరోజు ఖుష్భు గారు కూడా చాలా చిన్నపిల్లలా ఉన్నారండి" అని వర్షా ఇమ్ముని ఇరికిద్దామనుకుంది. కానీ ఇమ్ము తెలివిగా దణ్ణం పెట్టేసి ఆవిడతో పెట్టుకొను నేను అన్నాడు. ఇలా రష్మీ మీద హాట్ కామెంట్స్ చేసాడు ఇమ్ము. దీంతో ఒక నెటిజన్ మాత్రం "ఇమాన్యుల్ రష్మిని ఏ ఉద్దేశంతో అన్నావు" అంటూ కామెంట్ చేశారు. రాను రాను ఇమ్ము కామెడీలో డబుల్ మీనింగ్ ఎక్కువగా వినిపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.