ఏ హీరో కూడా నన్ను అలా నిలబెట్టలేదు
on Oct 7, 2024
బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ స్థాయి నుంచి టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాష్టర్ తన ప్రస్థానాన్ని ఎలా నిలుపుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. రాకేష్ మాష్టర్ దగ్గర డాన్స్ స్కిల్స్ నేర్చుకున్నారు. అలాగే ఎన్నో సాంగ్స్ లో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేశారు. చివరికి ఇప్పుడు ఎన్నో హిట్ సాంగ్స్ కి టాప్ హీరోస్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. అలాంటి శేఖర్ మాష్టర్ ఒక చిట్ చాట్ లో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పారు. " నా పని నేను చేసుకుంటూ వెళ్ళా. మంచి పొజిషన్ లో నిలబడ్డా. ఫైట్ మాష్టర్ సాంబశివరావు గారి సాయంతో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను.
మా భావాన్ని మావయ్యకు నా అభిరుచి గురించి చెప్పేసరికి సాంబశివ రావు మావయ్య దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన నన్ను ఫైట్ మాష్టర్ రాజు గారి దగ్గరకు తీసుకెళ్లి నా గురించి చెప్పి కార్డు ఇప్పించేసరికి అలా డాన్స్ మాస్టర్ గా నా జర్నీని స్టార్ట్ చేసాను. కొరియోగ్రాఫర్స్ లో నా రోల్ మోడల్ ప్రభుదేవా. డాన్స్ లో ఈ హీరోస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చిరు గారి డాన్స్ లో గ్రేస్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫాస్ట్ డాన్సర్. చెప్పగానే నేర్చేసుకుంటారు. రామ్ చరణ్ డాన్స్ చాలా షార్ప్ గా చేస్తారు. అల్లు అర్జున్ డాన్స్ లో స్వాగ్ ఉంటుంది. ఢీ షోలో వర్క్ చేసి అదే షోకి జడ్జ్ గా వెళ్లడం చాలా బాగుంది. అంటే ఎలా ఐతే ఒక స్కూల్ లో చదువుకుని ఆ స్కూల్ కి ప్రిన్సిపాల్ గా వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అలా ఉంది. ఒక సాంగ్ విషయంలో ఒక హీరో ఎక్కువ సేపు వెయిట్ చేయించారని అనుకుంటున్నారు చాలామంది. కానీ స్టార్టింగ్ డేస్ లో నేను చాలామంది డైరెక్టర్స్ దగ్గరకు వెళ్లాను కానీ అలా ఎవరూ వెయిట్ చేయించలేదు. ప్రభుదేవా, లారెన్స్ లా డైరెక్షన్ చేస్తానా లేదా అనే విషయం తెలీదు. ఎప్పుడు మూడ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఏ హీరోతో చేస్తానని విషయాన్నీ కూడా చెప్పలేను. అసలు చేస్తానో లేదో కూడా తెలీదు." అంటూ ఎన్నో విషయాలు చెప్పారు.
Also Read