Brahmamudi : కొడుకు కోసం భర్తని బెడ్ రూమ్ నుండి పంపించేసిన భార్య!
on Nov 26, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -577 లో.....అపర్ణ ఇంటికి రానని చెప్పడంతో రాజ్ కోపంగా ఇంటికి వెళ్తాడు. అక్కడ ఎందుకు తీసుకొని రాలేదని వాళ్లు అడగడంతో.. రానని అంటుంది.. దానికి నేనేం చెయ్యాలి.. వెళ్లామన్నారు.. వెళ్ళాను ఇక నన్ను విసిగించకండి అని రాజ్ కోపంగా పైకి వెళ్తాడు.
ఆ తర్వాత అపర్ణకి సుభాష్ ఫోన్ చేసి.. నువ్వు ఏదో అనుకుంటే ఏదో అవుతుందని అంటాడు. నేను అనుకున్నది జరుగుతుంది వాడు మళ్ళీ వస్తాడని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఇదంతా ఎందుకని కావ్య చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందరు చెప్పేవాళ్లే అంటు అపర్ణ కోప్పడుతుంది.. మరొకవైపు రుద్రాణి టైమ్ దొరికితే చాలు ధాన్యలక్ష్మిని రెచ్చ గొట్టడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ లు సరదాగా బయటకి వెళ్తారు. పానీపూరి తింటుంటే అప్పుడే అనామిక చూసి పాపం మీకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఎగతాళిగా మాట్లాడుతుంది. నువ్వేం చెయ్యలేవు.. మీ అన్నని ఆస్తులు రాసి ఇవ్వమనంటూ కళ్యాణ్ ని చీప్ గా మాట్లాడుతుంటే అప్పు తనపై కోప్పడుతుంది. అనామిక వెళ్ళిపోయాక ఇలాంటి వాళ్ళకి మన గెలుపు సమాధానం కావాలని అప్పుతో కళ్యాణ్ అంటాడు.
మరొకవైపు పనిమనిషికి రుద్రాణి అన్ని పనులు చెప్పి.. పనిమానెలా చేస్తుంది. ఇక రాజ్ బ్రతిమిలాడి తన తల్లిని ఇంటికి తీసుకొని వస్తాడని రుద్రాణి అనుకుంటుంది. ఆ తర్వాత రాజ్ గదిలోకి సుభాష్ పడుకోవడానికి వస్తాడు. నా భార్య లేని గదిలో పడుకోను.. అందుకే వచ్చానని సుభాష్ అంటాడు. మరొకవైపు వెళ్లిపోయిన కావ్యని తీసుకొని రావడానికి ట్రై చేసున్నారు కానీ కళ్యాణ్ గురించి ఎవరు అలోచించడం లేదని ప్రకాష్ ని గదిలో నుండి పంపిస్తుంది ధాన్యలక్ష్మి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read