రుద్రాణి ప్లాన్ మిస్.. కావ్య అనుకున్నది జరుగుతుందా?
on Sep 20, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -205 లో.. తన వల్లే ఇంట్లో గొడవలు అవుతున్నాయని కావ్య భావిస్తుంది. ఈ సమస్యకి తనే సొల్యుషన్ ఇవ్వాలనుకోని అపర్ణ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది కావ్య. అపర్ణ మాట్లాడడానికి ఇష్టపడకపోయిన వినండి అని కావ్య చెప్తుంది. అయిన వినకుండా వెళ్తున్న అపర్ణని కావ్య ఆగమని చెప్తుంది.
మీరు వేరుగా ఉండి ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా ఉంటే, మీరు ఇంట్లో అందరికి దూరమవుతారు.. అప్పుడే ఇంట్లో అందరికి నాపై సింపతీ పెరిగి నేను వాళ్ళకి మరింత దగ్గర అవుతాను. ఇప్పుడిప్పుడే మీ అబ్బాయి నాకు దగ్గర అవుతున్నారు. ఇక మీరు దూరంగా ఉంటే పూర్తిగా నాకు దగ్గర అవుతాడు. ఇన్ని రోజులు మీరు దేనికైతే భయపడ్డారో అదే జరుగుతుంది అని అపర్ణతో కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అపర్ణ ఆలోచనలో పడుతుంది. మరొక వైపు ఇంట్లో నన్ను అవమానిస్తావా? నీకు నీ అత్తకు మధ్య గొడవ పెట్టానని రుద్రాణి మందు తాగుతూ హ్యాపీగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. అపర్ణ వచ్చి సోఫాలో కూర్చొని.. కావ్య అని గట్టిగా అరుస్తుంది. మళ్ళీ ఏం గొడవ అవుతుందోనని అందరూ టెన్షన్ పడుతుంటారు. కానీ కాఫీ తీసుకొని రా? టిఫిన్ ఏం చేసావ్? నన్ను అడిగే చెయ్యాలి కదా అని కావ్య మీద అపర్ణ పెత్తనం చెలాయిస్తుంది. అపర్ణ మాట్లాడినందుకు కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే అత్తయ్య మీకు నచ్చిందే, మిమ్మల్ని అడిగే చేస్తానని కావ్య అంటుంది. మరొకవైపు ఇదంతా చూస్తున్న రుద్రాణి.. కావ్యపై కోపంగా ఉంటుందనుకుంటే ఇలా చేసిందేంటని అనుకుంటుంది.
మరొకవైపు రాజ్ తో అపర్ణ మాట్లాడుతుంది. దాంతో రాజ్ సంతోషపడుతు అందరికి చెప్తాడు. మీ అమ్మ నీతో మాట్లాడటానికి కారణం కావ్య అని రాజ్ తో ధాన్యలక్ష్మి చెప్పగానే.. కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి తనని ఎత్తుకొని తిప్పుతాడు.చాలా థాంక్స్ అని కావ్యకి రాజ్ చెప్తాడు. మరొక వైపు ఇంట్లో పనిమనిషిని రావొద్దని చెప్పాను. ఇక నుండి కావ్యనే అంత పని చెయ్యాలి. పెద్దల మాటకు గౌరవం ఇవ్వకుంటే ఎలా ఉంటుందో చూపిస్తానని రుద్రాణికి చెప్తుంది అపర్ణ. మరొక వైపు కృష్ణమూర్తి వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర కావ్య ఇంకా రాలేదని తనకోసం ఎదురుచూస్తుంటాడు. తను అలా ఎదురుచూస్తుండటం గమనించిన అప్పు.. అక్క వస్తుంది. నువ్వు టెన్షన్ పడకని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read