Brahmamudi : భర్తకి నమ్మకద్రోహం చేసిన భార్య.. తప్పుగా అర్థం చేసుకున్నాడా!
on Oct 5, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -532 లో.....అనామిక చేసిన చీటింగ్ తో కావ్య బయటకి వచ్చి బాధపడుతుంటే.. రాజ్ వాళ్ళు వెళ్తుంటారు. కంగ్రాట్స్ అంటూ కావ్యతో రాజ్ కోపంగా మాట్లాడతాడు. ఇన్ని రోజులు ఈ మూలనో ప్రేమ ఉండేది.. అది ఈ రోజుతో చచ్చిపోయింది.. నాకు అవార్డు రానందుకు కాదు నాకు నమ్మకద్రోహం చేసినందుకని రాజ్ అంటాడు. నేను చెప్పేది వినండి అంటూ కావ్య ఏడుస్తుంది. ఏం చెప్తావ్ అనామిక ట్రాప్ లో పడ్డాను అంటావా అంటూ కావ్యపై రాజ్ విరుచుకుపడతాడు.
రాజ్ ని రుద్రాణి ఇంకా రెచ్చగొడుతుంది. మా రాజ్ నిన్ను మళ్ళీ తీసుకొని రావాలనుకున్నాడు కానీ నువ్వు ఇలా శత్రువులతో చేతులు కలిపి ఇలా చేస్తావ్ అనుకులేదని రుద్రాణి తిడుతుంది. రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. మావయ్య అని కావ్య అనగానే నాకేం చెప్పకు అమ్మ అని సుభాష్ అంటాడు. మీరు కూడ నేను తప్పు చేశానని నమ్ముతున్నారా అని కావ్య అంటుంది. ఇదంతా అబద్దం అయితే బాగుండు. రాజ్, రుద్రాణిలా నేను మాట్లాడలేను.. ఎప్పటికైనా మీరు ఒకటి అవుతారనుకున్నాను.. నువ్వు చేసిన పనివల్ల వాడి మనసు ముక్కలు అయిందని సుభాష్ అంటాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి సామంత్, అనామిక లు వస్తారు. కంగ్రాట్స్ కావ్య అని అనామిక అనగానే.. మీరు బిగించిన ఉచ్చులో ఈజీగా పడ్డందుక అని కావ్య అంటుంది. ఆ సామ్రాజ్యాన్ని పడవేసే అవకాశం నీకుంది. దానికి దారి మేమ్ చూపిస్తామని అనామిక అనగానే.. అనామిక చెంప చెల్లుమనిపస్తుంది కావ్య. నీకు అసలు పొగరు తగ్గలేదని అనామిక అంటుంది. ఆ కంపెనీని భూస్థాపితం చేస్తానని అనామిక అనగానే .. నేనుండగా ఆ ఇంటి ముందు మొలిచిన గడ్డిని కూడా పీకలేవని కావ్య సవాలు విసురుతుంది.
ఆ తర్వాత రాజ్ ఇంటికి వెళ్ళగానే కావ్య అలా చేసిందంటే నేను నమ్మలేక పోతున్నానని అపర్ణ రుద్రాణిలు అంటారు. నేను అక్కడే ఉన్నాను కదా అని రాజ్ అంటాడు. ఒక్కొక్క సారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయ్ రాజ్ అని ప్రకాష్ అంటాడు. రుద్రాణి ఇంకా కావ్య పై కోపం వచ్చేలా మాట్లాడుతుంది. తరువాయి భాగంలో కావ్య వ్యక్తిగతం అయిన కోపాన్ని వృత్తి వ్యాపారాల మీద చూపించింది. ఇంట్లో నుండి వెళ్లగొట్టానని పగ సాధించిందని రాజ్ అంటాడు. మరోకవైపు కావ్య జరిగింది కనకానికి చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత కావ్య ఈ ఇంటికి నమ్మకద్రోహం చేసిందని రాజ్ అంటాడు. రాజ్ కోపంగా కావ్య వస్తువులు, పెళ్లి ఫోటో ని బయటపడేసి కాల్చేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read