Naga Manikanta: మణికంఠకి సూపర్ పవర్ వస్తే ఆ పని చేస్తాడంట.. లైవ్ లో ఆమెతో హగ్గు వద్దంట!
on Jan 7, 2025
మణికంఠ అనగానే అందరికి బిగ్ బాస్ సీజన్-8 గుర్తొస్తుంది. అలాంటి మణికంఠ హౌస్ లో ఉన్నప్పుడు అతని గురించి పాజిటివ్ గా మాట్లాడిన వారే పవిత్ర, షబీనా షేక్. ఇద్దరు మణికంఠకి బెస్ట్ ఫ్రెండ్స్. ఇక మణికంఠక, షబీనా షేక్ కలిసి ‘కస్తూరి’ సీరియల్లో నటించారు. షబీనా కస్తూరి సీరియల్‌తో పాటు.. నాపేరు మీనాక్షి, అత్తారింటికి దారేది, గృహలక్ష్మి వంటి సీరియల్స్‌లో నటించింది. అయితే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలతో ఫేమస్ అయ్యింది.
అప్పట్లో యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసి.. ‘పెళ్లి చూపులు’ కార్యక్రమంలో మెరిసింది షబీనా బేగం. బిగ్ బాస్ సీజన్-8 జరుగుతున్న సమయంలో షబీనా మణికంఠ గురించి మాట్లాడి నెట్టింట వైరల్ అయింది. మణికంఠ గురించి నాకు బాగా తెలుసు. తను నేను కలిసి ‘కస్తూరి’ సీరియల్లో వర్క్ చేశాం. నాకు మా అన్నయ్య ఎలాగో తను కూడా అలాగే. మణికంఠ చాలా సెన్సిటివ్, ఎమోషనల్ పర్సన్. తను బిగ్ బాస్ హౌస్‌లో తన పర్సనల్ లైఫ్ గురించి ఏదైతే మాట్లాడాడో.. అవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్న మాటలే. అతను ఎంత సెన్సిటివ్ అంటే.. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూనే ఏడ్చేసేటంత ఎమోషనల్ పర్సన్ అంటు షబీనా అంది. ఇక షబీనా తాజాగా పవిత్ర, మణికంఠలతో ఓ వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ ' Shabeena Sheik' లో అప్లోడ్ చేసింది.
ఈ వ్లాగ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది మణికంఠేనా లేక యాక్ట్ చేశాడా? నీకు ఎవరంటే ఇష్టం? జంతువులా మారితే ఏం అవుతావ్ ఇలాంటి భిన్నమైన ప్రశ్నలకి సమాధానాలిచ్చాడు మణికంఠ. ముప్పై ఆరు నిమిషాలుంది ఈ వ్లాగ్. ఇందులో మణికంఠ బయట ఎలా ఉండేవాడో లోపల కూడా అలానే ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా తను ఓ పక్షిలా మారి ఎక్కడికైనా ఎగిరిపోవాలానుకుంటున్నాడంట... ఇంకా సూపర్ పవర్ వస్తే ఏం కావాలని కోరుకుంటున్నారని షబీనా అడగ్గా మాయమైపోయి తనకి ఎక్కడ కావాలంటే అక్కడ దూరిపోవాలనుకుంటున్నాడంట మణికంఠ. పవిత్ర తనకు మంచి ఫ్రెండ్ అని ప్రతీ దానికి ఎమోషనల్ అవుతుందంటూ.. అందుకే తనని క్రైయింగ్ బేబి అని అంటామంటు మణికంఠ అన్నాడు. ఇంకా హగ్గు కావాలా అని పవిత్ర అనగా అమ్మో వద్దని మణికంఠ చెప్పాడు. దాంతో షబీనా, పవిత్ర ఇద్దరు షాక్ అయ్యారు. ఏంటి హగ్గు స్టార్ హగ్గు వద్దంటున్నాడా అంటు ఇద్దరు కాసేపు ఆశ్చర్యంగా చూశారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో బూతులు మాట్లాడలేదని, కోపం వచ్చినా చాలావరకు కంట్రోల్ చేసుకున్నానంటూ మణికంఠ ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్లాగ్ కింద మణికంఠ డై హార్డ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యూట్యూబ్ లో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Also Read