చిలుకతో ఎంజాయ్ చేసిన బిగ్ బాస్ అశ్విని!
on Apr 3, 2024
అశ్విని శ్రీ సోషల్ మీడియాని ప్రస్తుతం షాక్ చేస్తున్న బ్యూటీ. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చింది. కానీ సరైన బ్రేక్ రాలేదు. దాంతో ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలీలేదు. కొన్ని మూవీస్ లో హీరోయిన్ గా నటించింది. అవి ఏమంత పెద్దగా ఆడలేదు. కొంతమంది స్టార్ హీరోల మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ చేసింది. కానీ ఏమంత క్లిక్ కాలేదు. అశ్విని శ్రీ హీరోయిన్ మెటీరియల్ కానీ సరైన మూవీ ఇంతవరకు పడలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో ఒక చిన్న రోల్ లో అలాగే మహేష్ బాబు హీరోగా చేసిన సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోయిన్ రష్మిక మందాన అక్క పాత్రలో నటించింది. ఆమెకు ఏమంత పెద్ద హిస్టరీ లేకపోయినా కూడా బిగ్ బాస్ సీజన్ 7 లో కనిపించింది. అంతే ఒక్కసారిగా ఆమె స్టార్ ఐపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అశ్విని శ్రీ అందాలే కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ఆమె నటించిన ఒకప్పటి మూవీస్ వైరల్ అవుతున్నాయి. అలాంటి అశ్విని ఒక చిలకతో ముచ్చట్లు పెట్టింది. ఆ చిలక అశ్విని చేతి మీద ఠీవిగా కూర్చుని "బాగున్నావా" అని అడిగింది. "బాగున్నాను నువ్వు బాగున్నావా" అని రివర్స్ లో అడిగింది అశ్విని. ఇక ఆమె ఆపిల్ పెట్టేసరికి చక్కగా తింటూ ఎంజాయ్ చేసింది ఆ మాట్లాడే చిలుక. ఈ వీడియో ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నెటిజన్స్ వీళ్ళను చూసాక ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "ఒక చిలుక మరో చిలుకకు తినిపిస్తోంది. ఒకే ఫ్రేమ్ లో రెండు చిలుకలు...అశ్విని రాజా ది గ్రేట్ మూవీలో రవితేజతో కలిసి ఓ పాటలో స్టెప్పులేసింది. అలాగే అమీర్ పేట్ లో, బీటెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ వంటి చిన్న మూవీస్ లో నటించింది.
అశ్విని వరంగల్ నిట్ కాలేజీలోనే బీటెక్ పూర్తి చేసి మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మూవీ ఇండస్ట్రీలోకి రావడానికి అశ్విని వాళ్ళ పేరెంట్స్ మొదట ఒప్పుకోలేదు కానీ తనకిష్టమైన రంగంలోకి వెళ్లాలని పట్టుబట్టి మోడలింగ్ చేస్తూ మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఇక బిగ్ బాస్ తర్వాత మాల్స్ ఓపెనింగ్స్ చేస్తూ రకరకాల ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.