హెయిర్ కట్ ఛాలెంజ్ లో ఆ ఇద్దరు.. షాక్ అయిన కంటెస్టెంట్స్!
on Oct 18, 2024
బిగ్ బాస్ ప్రేక్షకులు శుక్రవారం నాటి ప్రోమో కోసం ఎంతో ఆత్రుతగా ఎదరుచూస్తుంటారు. అయితే రెండు ప్రోమోలు ఇప్పటికే యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. మొదటి ప్రోమోలో మెగా చీఫ్ కంటెండర్ ఇంకా మెగా చీఫ్ ల టాస్క్ గురించి ఉంది. ఇక రెండవ ప్రోమో విషయానికొస్తే ఇరు క్లాన్స్ కి హెయిర్ కట్ ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎలా హెయిర్ కట్ చేయించుకుంటే వాళ్ళకి ప్రైజ్ మనీలోకి డిస్ప్లే ఉన్న అమౌంట్ ఆడ్ అవుతుందని బిగ్ బాస్ మామ తెలిపాడు.
ఇక అప్పటికే పృథ్వీ గడ్డం తీసేస్తా అని నిఖిల్ తో అంటుంటే.. అబ్బా వద్దు ప్లీజ్ అని విష్ణుప్రియ అంటుంది. ప్లీజ్ బ్రో బ్రతకలేనని పృథ్వీ అంటాడు. టాస్క్ లో భాగంగా ఓజీ క్లాన్ నుండి పృథ్వీ.. రాయల్ క్లాన్ నుండి అవినాష్ ల పేర్లు బిగ్ బాస్ చెప్తాడు. డిస్ప్లే లో ఉన్న హెయిర్ స్టైల్ ఇంకా అమౌంట్ చూసి అవినాష్, పృథ్వీ ఇద్దరు షాక్ అవుతారు. ఇక ఆ ఫోటోలని చూసి హౌస్ మేట్స్ మాత్రం ఫుల్ నవ్వుకున్నారు. బిగ్ బాస్ ఇద్దరికి మీరు ఎంత అమౌంట్ ప్రైజ్ మనీ కి ఆడ్ చెయ్యాలనుకుంటున్నారో బిగ్ బాస్ కి చెప్పండని బిగ్ బాస్ చెప్తాడు. ఇక సీన్ కట్ చేస్తే ఇద్దరు హెయిర్ కట్ ఛాలెంజ్ కి ఒప్పుకున్నారని తెలుస్తుంది కానీ ఎవరు ఏ హెయిర్ స్టైల్ చేయించుకొని ఎంత అమౌంట్ ఆడ్ చేశారనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
అయితే ఈ హెయిర్ కట్ ఛాలెంజ్ ప్రతి సీజన్ లో ఉంటూ వస్తుంది. బిగ్ బాస్ మాములోడు కాదు.. ఎవరికి ఏది అంటే ఇష్టమో వాళ్ళనే ఈ ఛాలెంజ్ కి తీసుకుంటాడు. గత సీజన్ లలో దీప్తి సునైన, శివజ్యోతి, దేత్తడి హారిక , వాసంతి కృష్ణన్, ప్రియాంక జైన్.. ఈసారి మాత్రమే ఈ ఆఫర్ అమ్మాయిలకి కాకుండా అబ్బాయిలకి ఇచ్చాడు బిగ్ బాస్. మరి నేటి ఎపిసోడ్ లో అటు మెగా ఛీఫ్ ఎవరని, ఇటు హెయిర్ కట్ ఎవరు చేయించుకుంటారనే ఆసక్తి అందరిలో మొదలైంది.