న్యూ ఇయర్ కి ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలుసా?
on Dec 31, 2017

డిసెంబర్ 31 వస్తుంది అనగానే అదేదో తమకి ఆ రోజే ఫ్రీడమ్ వచ్చింది అన్నంతగా చెలరేగిపోతారు కుర్రకారు. ఆ రోజు మొదలు పెడితే కొత్త సంవత్సరంలోకి అడుగిడిన మరుసటి రోజు వరకు సెలెబ్రేషన్స్ కంటిన్యూ అవుతాయి. సాధారణ జనాల పరిస్థితే ఇలా ఉంటే, ఇంక సెలబ్రిటీల వేడుకలు ఎలా ఉండబోతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో సెలబ్రిటీ లు పార్టీస్ లో డాన్స్ లు చేసి క్యాష్ చేసుకునే పనిలో ఉంటే, టాలీవుడ్ లో మాత్రం తమ క్లోజ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు.
మరి, బాహుబలి తో ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకోబుతున్నాడు. ప్రభాస్ ఆల్రెడీ అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో ఉన్నాడు. అలా అని చెప్పేసి మన బాహుబలి స్టార్ అక్కడకు వెళ్ళింది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంత మాత్రం కాదు. విషయం ఏంటంటే, తన తదుపరి చిత్రం సాహూ కోసం పూర్తిగా సన్నద్ధమవడానికి అక్కడ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ప్రభాస్. త్వరలో దుబాయ్ లో ఒక హై వోల్టేజ్ ఆక్షన్ సీన్ ని షూట్ చేయనున్నారు. 2018 చివర్లో విడుదల అవనున్న సాహూ కోసం న్యూ ఇయర్ లాంటి కొన్ని సెలెబ్రేషన్స్ కి దూరంగా ఉంటున్నాడు. ఇంత డెడికేషన్ ఉన్న ప్రభాస్ నిజంగా గొప్పోడే, మీరేమంటారు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



