"నిన్నుచూసి గర్విస్తున్నాం".. తమ్ముడికి సాయితేజ్ భావోద్వేగ బర్త్‌డే విషెస్
on Jan 13, 2022

గురువారం (జనవరి 13) పంజా వైష్ణవ్‌తేజ్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. గత ఏడాది 'ఉప్పెన'తో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు వైష్ణవ్‌తేజ్. రెండో సినిమా 'కొండపొలం' బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించకపోయినా, నటునిగా అతనికి మరింత పేరు తెచ్చింది. అన్నయ్య సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌కు గురై హాస్పిటల్ బెడ్ మీద అచేతనంగా పడుకుని ఉండటం చూసిన వైష్ణవ్‌తేజ్ బాధ వర్ణనాతీతం. అదే అన్నయ్య ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.
Also read: జనవరి 12.. బన్నీకి మళ్ళీ మళ్ళీ విజయాలనిచ్చిన రోజు!
ఆ విషయాన్ని గుర్తుచేస్తూ, తమ్ముడికి బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ, భావోద్వేగంతో ఒక నోట్ రాశాడు సాయిధరమ్ తేజ్. ఇద్దరూ క్రికెట్ బ్యాట్లు పట్టుకొని ఉన్న ఒక ఫొటోతో పాటు ఆ నోట్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా దానిని షేర్ చేశాడు. ఆ నోట్‌లో సాయితేజ్ రాసిన విషయాలు మన హృదయాల్నీ స్పృశించకుండా ఉండవు.
Also read: బన్నీ బ్లాక్ బస్టర్ మూవీ `దేశ ముదురు`కి 15 ఏళ్ళు!
"మై డియర్ వైషు బాబు.. నీకు వెరీ హ్యాపీ బర్త్‌డే. గత ఏడాది మనకు ఒక బ్యూటిఫుల్ ఇయర్. నీ ఫస్ట్ ఫిల్మ్ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో విజయం సాధించింది. అంతేకాదు, ఏడాది ఆఖరులో అవసరమైన టైమ్‌లో మన ఫ్యామిలీకి అండగా నిలిచావు. హాస్పిటల్ బెడ్ మీద నీ అన్నయ్యను చూసి, అన్నయ్యా అని నువ్వు పిలుస్తుంటే నేను స్పందించకపోవడం చూసి బాధపడ్డావు. ఆ నొప్పిని అనుభవిస్తూనే నా ఆరోగ్యానికి సంబంధించి వచ్చిన అనేక ఫోన్లకు సాధ్యమైనంత వరకు సమాధానం చెప్తూ వచ్చావు. వణకడం తెలీని రాయిలా నిలబడ్డావు. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నన్ను చూసిన నీ కళ్లల్లో ఆనందం చూశాను. మై డియర్ లిటిల్ బ్రదర్, బేషరుతుగా నువ్వు ప్రేమించబడుతున్నావు. నిన్ను చూసి మేం గర్విస్తున్నాం. నీకు ఆ దేవుడు అమితమైన సంతోషం, ప్రేమ, నవ్వు అందించాలని కోరుకుంటున్నా. లవ్ యు బాబు - సాయిధరమ్ తేజ్" అని ఆ నోట్‌లో అతను రాసుకొచ్చాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



