ఎన్టీఆర్ దెబ్బకు దిగొచ్చిన యశ్ రాజ్ ఫిలిమ్స్!
on Mar 16, 2025
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'వార్-2' (War 2). యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఆగస్టు 14న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇటీవల డ్యాన్స్ రిహార్సల్స్ లో హృతిక్ కాలికి గాయమైంది. దీంతో షూటింగ్ ఆలస్యమై, సినిమా వాయిదా పడే అవకాశముందని వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు తాజాగా యశ్ రాజ్ ఫిలిమ్స్ చెక్ పెట్టింది.
'వార్-2' నుంచి ఇంతవరకు అధికారికంగా ఒక్క పోస్టర్ కూడా రాలేదు. అయినప్పటికీ బిగ్గెస్ట్ స్టార్స్ హృతిక్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'వార్-2'పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అందుకే మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టకుండానే.. ఈ మూవీకి ప్రమోషన్స్ జరుగుతున్నాయి. స్పై యూనివర్స్ లోని మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ వాట్సాప్ గ్రూప్ లో చాట్ చేసుకుంటున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో అందరినీ రిమూవ్ చేసుకుంటూ వచ్చి.. చివరికి కబీర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న హృతిక్ కి ఎన్టీఆర్ హలో చెప్పినట్టుగా ఉంది. ఈ వీడియోకి నెటిజెన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ వీడియోకి యశ్ రాజ్ ఫిలిమ్స్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిప్లై రావడం విశేషం. "మేము #War2 మార్కెటింగ్ ప్రారంభించక ముందే మీరు దానిని అద్భుతంగా సెటప్ చేసారు. 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అల్లకల్లోలం ఏర్పడుతుంది." అని యశ్ రాజ్ ఫిలిమ్స్ రాసుకొచ్చింది. దీంతో వార్-2 ముందు నుంచి అనుకున్నట్టుగానే.. ఆగస్టు 14న విడుదల కానుందని క్లారిటీ వచ్చింది. అలాగే ఈ సినిమాపై యశ్ రాజ్ ఫిలిమ్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో అర్థమవుతోంది.
మొత్తానికి స్పై యూనివర్స్ లోకి ఎన్టీఆర్ ఎంటర్ అయినట్టుగా చూపిస్తూ క్రియేట్ చేసిన ఈ వీడియో దెబ్బకి.. ఇంతకాలంగా మూవీ అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్న యశ్ రాజ్ ఫిలిమ్స్.. రిలీజ్ డేట్ క్లారిటీ ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
