ఆయన అందుకే గొప్పోడయ్యాడంటోంది..!
on May 17, 2016
నువ్విలా, గౌరవం సినిమాల్లో నటించిన యామీ గౌతమ్ గుర్తుందా..? ఆ తర్వాత పెద్దగా తెలుగులో ఈ భామకు పనిదొరకలేదు లెండి. ఫెయిర్ అండ్ లవ్ లీ యాడ్ తో ఫ్యామస్ అయిన యామీకి ఇప్పుడు టాలీవుడ్ లో ఆఫర్లేమీ లేకపోయినా, బాలీవుడ్ మాత్రం ఒకటి రెండు ఛాన్సులు ఇస్తోంది. ప్రస్తుతం అక్కడి కండల వీరుడు హృతిక్ తో కాబిల్ అనే సినిమాలో నటిస్తోంది. సినిమా షూటింగ్ లో హీరోగారిని బాగా అబ్జర్వ్ చేసినట్టుంది. హృతిక్ తో కలిసి పనిచేయడం, చాలామంది హీరోయిన్లకు ఒక కల. ఆ కల నిజమవడం నాకు చాలా ఆనందంగా ఉంది. హృతిక్ ఎందుకంత గొప్ప నటుడయ్యారో, ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అర్ధమైంది. ఆయనకు సినిమా అంటే ప్యాషన్, డెడికేషన్ అంటూ పెద్ద పెద్ద పదాలతో పొగిడేస్తోంది. ఈ కాబిల్ మూవీ హృతిక్ అభిమానులకు పండగ అవుతుందని కూడా అమ్మడు సెలవిస్తోంది. హీరోలను పొగిడే ఆర్ట్ ఈ భామకు ఇన్నాళ్లకు అబ్బినట్టుంది. సంజయ్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యామీ గౌతమ్ ఒక దివ్యాంగురాలిగా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించడం విశేషం.