యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత
on May 21, 2018

ఓ రెండు తరాల పాటు తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన నవలారాణి, యద్దనపూడి సులోచనారాణి మరణించారు. కాలిఫోర్నియాలో తన కూతురి వద్ద ఉంటున్న 78 ఏళ్ల సులోచణారాణి గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలియచేశారు. టీవీ, సెల్‌ఫోన్లు లేని కాలంలో యద్దనపూడి రాసిన నవలలే ప్రజలకు కాలక్షేపంగా ఉండేవి. ఆమె నవలల స్ఫూర్తితో పదికి పైగా సినిమాలు తీశారు. వాటిలో సెక్రటరీ, జీవనతరంగాలు, మీనా, ఆత్మగౌరవం సూపర్‌హిట్‌గా నిలిచాయి. సెక్రటరీ సినిమా వాణిశ్రీకి సరికొత్త స్టార్‌డమ్‌ని అందించింది. మీనా సినిమా విజయనిర్మలను దర్శకురాలిగా నిలబెట్టింది. ఆ మీనా నవల స్ఫూర్తితోనే తిరిగి త్రివిక్రమ్ ‘అ...ఆ...’ సినిమా తీసినా, ఎక్కడా సులోచనారాణి పేరు కనిపించకపోవడంతో, తన కెరీర్‌లోనే అతిపెద్ద అప్రతిష్టని మూటగట్టుకున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



