విజయ్ దేవరకొండ లాస్ట్ లవ్ స్టోరీ.. 'వరల్డ్ ఫేమస్ లవర్' ట్రైలర్ రివ్యూ
on Feb 6, 2020

"ఈ ప్రపంచంలో నిస్వార్థమైనది ఏదైనా ఉన్నదంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండక్షరాలు ఓ సునామీనే రేపగలవు. ఐ వాంటెడ్ టు బి ద వరల్డ్ ఫేమస్ లవర్" .. "నా గుండెకు తగిలిన దెబ్బకి ఆ పెయిన్ తెలవకుండా ఉండాలంటే ఫిజికల్ గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలి"... ఇవి 'వరల్డ్ ఫేమస్ లవర్' ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్స్. గురువారం ఈ ట్రైలర్ రిలీజైంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు - రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే నటించారు.
కొద్ది రోజుల క్రితం ఈ మూవీ టీజర్ రిలీజయినప్పుడు చాలామంది కన్‌ఫ్యూజన్‌కు గురయ్యారు. విజయ్ ఒక క్యారెక్టర్ చేశాడా, లేక డ్యూయల్ రోల్‌లో కనిపిస్తాడా.. అని చాలామంది సందేహపడ్డారు. ముఖ్యంగా ఆ టీజర్‌లో రాశీఖన్నా కనిపించిన తీరుచూసి ఆశ్చర్యపోయారు. ఇప్పటిదాకా అంత బోల్డుగా ఆమె కనిపించలేదు. విజయ్‌తో లిప్‌లాక్‌లే కాకుండా లవ్ మేకింగ్ సీన్ కూడా ఉండటంతో సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ బాధను వ్యక్తం చేస్తూ పోస్టులు కూడా పెట్టారు. ఇది రాశీని సైతం బాధపెట్టింది. ఆ టీజర్ తన ఫ్యాన్స్‌ను కొంచెం బాధపెట్టిందనీ, తను కూడా ఆ టీజర్ విషయంలో కొంచెం బాధపడ్డాననీ ఆమె తెలిపింది కూడా. అయితే ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. ఇందులో నలుగురు హీరోయిన్లతో విజయ్ ఎలా బిహేవ్ చేస్తాడో ప్రధానంగా చూపించారు. పార్టనర్ అయిన రాశీతో ఎంతో లవ్లీగా బిహేవ్ చేసే విజయ్.. భార్య అయిన ఐశ్వర్యా రాజేష్‌తో రూడ్‌గా ప్రవర్తించడం కనిపిస్తుంది. కేతరిన్‌తో సహవాసాన్ని ఒక ఫాంటసీ అన్నట్లు దర్శకుడు ట్రైలర్‌లో చూపించాడు. ఫ్రాన్స్‌లో ఇజాబెల్లేను అతడి గాళ్‌ఫ్రెండ్‌గా చూపిస్తూ, ఆమెతో విజయ్ సరదాగా గడుపుతున్నట్లు చిత్రీకరించాడు.
టీజర్‌లో విజయ్ కనిపించిన తీరుకూ, ట్రైలర్‌లో అతను కనిపించిన తీరుకూ తేడా కనిపించింది. టీజర్‌లో అతడిని చూసినవాళ్లు 'అర్జున్‌రెడ్డి', 'డియర్ కామ్రేడ్' సినిమాల తరహాలోనే కనిపిస్తున్నాడంటూ కామెంట్లు చేశారు. కానీ ట్రైలర్ చూశాక ఇంతదాకా తెరపై కనిపించిన దానికి చాలా భిన్నమైన క్యారెక్టర్‌లో విజయ్ కనిపించబోతున్నాడనేది స్పష్టమవుతోంది. ఒకరికి నలుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ, తెరను వాళ్లు అందంగా మార్చేసినప్పటికీ, విజయ్ తన నటనతో డామినేట్ చేసినట్లు అనిపించింది. గౌతమ్ అనే ఫ్రస్ట్రేటెడ్ లవర్‌గా విజయ్ ప్రదర్శించిన అభినయానికి ధీటుగా యామిని క్యారెక్టర్‌ను రాశీ ఖన్నా పోషించిందని చెప్పాలి. ఆ ఇద్దరూ పోటాపోటీగా నటించినట్లు ట్రైలర్‌లోని షాట్లు తెలియజేస్తున్నాయి. భార్య సువర్ణగా ఐశ్వర్య అచ్చుగుద్దినట్లు సరిపోయిందని చెప్పాలి. విజయ్, ఐశ్వర్లకు ఒక కొడుకు కూడా ఉన్నాడన్నట్లు ట్రైలర్ చూపిస్తోంది. దగ్గరకు రాబోతున్న ఆమెని విజయ్ విసుక్కొనే తీరు చూస్తుంటే, ఆమె అంటే అతడికి ఏమాత్రం ఇష్టంలేదన్నట్లు కనిపిస్తోంది. క్యాథరిన్ కూడా ఇంతదాకా కనిపించని డిఫరెంట్ రోల్ చేసినట్లు భావించవచ్చు. ఆమె స్మిత అనే రోల్ చేసింది. రాశీ ఖన్నా ప్రకారమైతే ఈ సినిమాకి హీరో విజయ్ కాదు, క్రాంతిమాధవ్ రాసిన స్టోరీ. ఇలాంటి స్క్రీన్‌ప్లేను తాను ఇంతదాకా చూడలేదని రాశి ప్రశంసించడం చూస్తుంటే.. ఈ సినిమాలో మంచి విషయం ఉన్నదనే ఫీలింగ్ కలుగుతోంది. ట్రైలర్‌కు సంబంధించి కొట్టొచ్చినట్లు కనిపించిన అంశం.. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేం ఎంతో రిచ్‌గా, ఐ ఫీస్టుగా కనిపిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి గమనించదగ్గ విషయమేమంటే.. విజయ్ దేవరకొండ సినిమా అంటే హడావిడి, ఎగ్జైట్‌మెంట్ ఉంటాయి. మళ్లీ వీడు ఏం సినిమా చేశాడని పబ్లిక్‌లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వీడితో నలుగురు హీరోయిన్లు ఎందుకు చేస్తున్నారని ఎగ్జిబిటర్స్ లో, డిస్ట్రిబ్యూటర్స్ లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. బహుశా విజయ్ ఈ సినిమాతో నాలుగు రెట్లు రిటర్న్స్ ఇస్తారనుకుంటూ ఉంటారు కూడా. 'డియర్ కామ్రేడ్' విడుదలకు చాలా రోజుల ముందే విజయ్ హడావిడి చెయ్యడం చూసిన మనం.. ఇప్పుడు ఫిబ్రవరి 14న 'వరల్డ్ ఫేమస్ లవర్' విడుదలవుతున్నా ఎలాంటి హడావిడీ చెయ్యకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదే తనకు లాస్ట్ లవ్ స్టోరీ అని అతడు ప్రకటించేశాడు. "మనిషిగా కొంచెం మారుతున్నా. టేస్టులు కొంచెం మారుతున్నాయి. బేసికల్ గా లైఫ్ లో కొత్త దశలోకి వెళ్తున్నా. ఇది చేసేప్పుడే నాకు తెలుసు.. ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ అవబోతోందని" అని చెప్పాడు విజయ్. అంటే.. అతడికి సంబంధించి 'వరల్డ్ ఫేమస్ లవర్' ఒక ఎమోషనల్ జర్నీ. నటుడిగా మరో దశలోకి మారే ముందు వస్తున్న సినిమా. దీనితో అతను వండర్స్ క్రియేట్ చేసి, అందరి ప్రేమకూ పాత్రుడవుతాడా? లెటజ్ వెయిట్ అండ్ సీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



