Home

»

Latest News

కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ 'వీకెండ్' మొదటి షెడ్యూల్ ప్రారంభం!

Nov 28, 2024 1:42PM

విఐపి శ్రీ హీరో గా, ప్రియా దేషపాగ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'వీకెండ్'. ఖడ్గధార మూవీస్ బ్యానర్ లో ఐడీ భారతీ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బి. రాము రచయిత మరియు దర్శకులు. పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న వీకెండ్ సినిమా షూటింగ్ నేడే మొదలైంది. (Weekend Movie)

దర్శక నిర్మాతల ఆధ్వర్యంలో చీరాల లోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్ ఆర్ ఐ లేళ జయ మొదట కెమెరా రోల్ చేయగా, సీనియర్ నటుడు అజయ్ ఘోష్ క్లాప్ కొట్టారు. షూట్ మొదలు పెట్టిన అనంతరం ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ అంతా చీరాల లోనే జరగబోతుందని చిత్ర దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.

ఈ సినిమాలో అజయ్ ఘోష్, ఎస్తర్, డెబోర, సునీత, జబర్దస్త్ అశోక్, యోగి ఖత్రే తదితరులు నటిస్తున్నారు. ఎన్ అర్జున్ సంగీతం అందిస్తుండగా, యూ ఎస్ విజయ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు ఈ ఎన్ స్టూడియో నిర్వహించనుంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com