మెగా జాతర.. 'వాల్తేరు వీరయ్య' రిలీజ్ డేట్ వచ్చేసింది
on Dec 7, 2022
ఎప్పుడూ లేని విధంగా 2023 సంక్రాంతికి ఒకే బ్యానర్ నుంచి రెండు బడా సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్న 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే 'వీర సింహా రెడ్డి' చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన మైత్రి.. తాజాగా 'వాల్తేరు వీరయ్య' రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రం సంక్రాంతికి రానుందని ఎప్పుడో ప్రకటించారు కానీ తేదీని రివీల్ చేయలేదు. అయితే జనవరి 12న 'వీర సింహా రెడ్డి', జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' వస్తాయని ఇటీవల వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్టే జనవరి 12న 'వీర సింహా రెడ్డి' విడుదలవుతుందని రీసెంట్ గా ప్రకటించిన మైత్రి.. తాజాగా జనవరి 13న 'వాల్తేరు వీరయ్య'ను విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో సముద్రంలో పడవపై వెళ్తున్న చిరంజీవి లుక్ ఆకట్టుకుంటోంది.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్రలో సందడి చేయనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
