వృషభ ఫస్ట్ డే ఒరిజినల్ కలెక్షన్స్ ఇవే.. ఫామ్ లోనే ఉన్నాడు కదా
on Dec 26, 2025

-అసలు కలెక్షన్స్ ఇవే
-ఎన్ని వచ్చాయి
-అభిమానులు, ప్రేక్షకులు ఏమంటున్నారు
సుదీర్ఘ కాలం నుంచి పాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతు వస్తున్న మోహన్ లాల్(MOhan Lal)నిన్న మరోసారి పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై 'వృషభ'(Vrusshabha)మూవీతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టాడు. రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కడంతో ప్రచార చిత్రాల నుంచే వృషభ పై అభిమానులు, మూవీ లవర్స్, ట్రేడ్ సర్కిల్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు ఈ మూవీకి వచ్చిన ఓపెనింగ్స్ అందర్నీ షాక్ కి గురి చేస్తున్నాయి. మరి ఆ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
తొలి రోజు అన్ని లాంగ్వేజెస్ కి సంబంధించి 70 లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు నిర్దారిస్తున్నాయి. మలయాళ వెర్షన్ 46 లక్షలు, తెలుగు వెర్షన్ 13 లక్షలు, హిందీ వెర్షన్ 2 లక్షలు ఇలా టోటల్ గా 70 లక్షలని మాత్రమే రాబట్టినట్టుగా చెప్తున్నారు. నిజానికి మోహన్ లాల్ వరుస విజయాలతో అప్రహాతీతంగా దూసుపోతూ మంచి ఫామ్ లో ఉన్నాడు.ప్రీవియస్ చిత్రాలైన లూసిఫర్ 2 , తుడరమ్ లే ఉదాహరణ. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించడంతో పాటు తొలి రోజు కూడా రికార్డు కలెక్షన్స్ ని రాబట్టాయి.అలాంటిది ఓపెనింగ్ లో అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టాల్సిన వృషభ మోహన్ లాల్ కెరీర్‌లోనే అత్యల్ప ఓపెనింగ్‌లలో ఒకటిగా నిలవడం సంచలనంగా మారింది. మరి వీకెండ్ అయినా వృషభ కి ఉపయోగపడుతుందో లేదో చూడాలి. ప్రస్థుతానికి అయితే అన్ని చోట్ల నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది.
Also Read: Vrusshabha Review: మోహన్ లాల్ 'వృషభ' మూవీ రివ్యూ
కథ విషయానికి వస్తే త్రిలింగ రాజ్య పాలకులైన 'వృషభ' వంశస్తులు పరమేశ్వరుడి కి సేవకులు. అత్యంత శక్తివంతమైన స్పటిక లింగానికి ఆ వంశం రక్షణగా నిలబడుతుంది.ఎంతో మంది దుష్టులు ఆ స్పటిక లింగాన్ని దక్కించుకోవడానికి విఫలయత్నం చేస్తారు. ఒకసారి ఓ దుష్టుడిని శిక్షించే క్రమంలో రాజా విజయేంద్ర వృషభ వదిలిన బాణం కారణంగా అభంశుభం తెలియని పసివాడు మరణిస్తాడు. కళ్ళముందే బిడ్డను కోల్పోయిన తల్లి..నీకు కూడా ఇదే గతి పడుతుందని వృషభ ని శపిస్తుంది. వృషభ తన మరో జన్మలో ఆది దేవ వర్మగా పుడతాడు.ఆ తర్వాత ఏం జరిగిందనేదే చిత్ర కథ. నందకిషోర్ దర్శకత్వంలో కనెక్ట్ మీడియా, బాలాజీ మోషన్ పిక్చర్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ నిర్మించాయి.సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, అలీ, నేహా సక్సేనా ఇతర ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



