ఢిల్లీలో పెద్ద హీరోలు లేరు.. కాశ్మీరీ ఫైల్స్ డైరెక్టర్ సంచలన ప్రకటన
on Apr 23, 2024
వివేక్ అగ్నిహోత్రి..ఇప్పుడు ఈ పేరు తెలియని ఇండియన్ సినీ ప్రేమికుడు లేడు.కాశ్మీరీ ఫైల్స్ తో ఆ ఘనతని సాధించాడు. ఎంతో డేరింగ్ సబ్జెక్టు ని అంతే డేరింగ్ గా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. తాజాగా తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో హీట్ ని రాజేస్తున్నాయి
అగ్ని హోత్రి కొన్ని రోజుల క్రితం తన తదుపరి చిత్రంగా దిల్లీ ఫైల్స్ ని ప్రకటించాడు. దీంతో అందరిలో కథ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఏర్పడింది. దీంతో నిత్యం దిల్లీ ఫైల్స్ అప్ డేట్ తెలుసుకోవడం కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక వార్త ఆకర్షణీయంగా మారింది.దిల్లీ ఫైల్స్ లో ఎలాంటి స్టార్స్ ఉండటం లేదు. బట్ కంటెంట్ మాత్రం చాలా భారీగానే ఉండబోతుంది. పైగా ఈ ఏడాదే మూవీ ప్రారంభం కాబోతుంది. నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాలన్నీ స్వయంగా అగ్ని హోత్రి నే ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.
అలాగే తన గురించి కొన్ని విషయాలని కూడా చెప్పాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు చెప్పలేని కథల్ని ప్రపంచానికి చెప్పడం ప్రారంభించాను. అందులో భాగంగానే ది తాష్కెంట్ ఫైల్స్ తెరకెక్కించాను. ఆ తర్వాత కాశ్మీరీ ఫైల్స్, ఇప్పుడు దిల్లీ ఫైల్స్ ని తెరకెక్కిస్తున్నాను. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని చెప్పాడు.కాశ్మీరీ ఫైల్స్ కి ఈయనే నిర్మాత. 2005 లో వచ్చిన చాక్లెట్ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన అగ్ని హోత్రి చరిత్రలో జరిగిన ఎన్నో దారుణాలని ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే సినిమాలని తెరకెక్కిస్తున్నాడు.
Also Read