పెళ్లి కొడుకైన వైవా హర్ష! అక్షర మెడలో మూడు ముళ్లు!!
on Oct 21, 2021
కామెడీ యాక్టర్, తన హాస్యంతో ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ వస్తున్న హర్ష చెముడు అలియాస్ వైవా హర్ష ఓ ఇంటి వాడయ్యాడు. బుధవారం హైదరాబాద్‌లో అక్షర మెడలో మూడు ముళ్లు వేశాడు హర్ష. సన్నిహితులు, దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలో కన్నుల పండువగా, ఆహ్లాదకరంగా జరిగిన ఈ వేడుకకు డైరెక్టర్ మారుతి, నటుడు ప్రవీణ్, నిర్మాత శ్రీనివాసకుమార్ (ఎస్.కె.ఎన్.), రైటర్-డైరెక్టర్ డార్లింగ్ స్వామి తదితులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
హర్షతో దిగిన సెల్ఫీ ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన మారుతి, "Happy married life @harshachemudu god bless u" అని ట్వీట్ చేశారు.
అంతకు ముందు తన వివాహానికి సంబంధించిన పలు ఘట్టాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో హర్ష షేర్ చేశాడు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చిన హర్ష, సినీ నటుడిగానూ రాణిస్తూ టాలెంటెడ్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
