త్రిషకి 'విశ్వంభర' టీం స్పెషల్ విషెస్!
on May 4, 2024
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'విశ్వంభర'. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ లో త్రిష కథానాయికగా నటిస్తోంది. నేడు(మే 4) త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమెకి విషెస్ తెలుపుతూ చిత్రం బృందం ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.
ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'విశ్వంభర' చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె. నాయుడు, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read