విశ్వంభర నుంచి రామ రామ ప్రోమో రిలీజ్
on Apr 11, 2025
.webp)
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అప్ కమింగ్ మూవీ విశ్వంభర(Vishwambhara).సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుండగా బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు.విక్రమ్ రెడ్డి సమర్పణలో యువి క్రియేషన్స్ పై వంశీ కృష్ణారెడ్డి,ప్రమోద్ ఉప్పలపాటి చిరు కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్నిఅందించాడు.
ఇప్పుడు ఈ మూవీ నుంచి హనుమాన్(Hanuman)జయంతి సందర్భంగా ఫస్ట్ సింగిల్ గా 'రామరామ'(Raama Raama)అనే భక్తి సాంగ్ రేపు ఉదయం 11 :12 నిమిషాలకి విడుదల కానుంది.ఈ సందర్భంగా రీసెంట్ గా మేకర్స్ ప్రోమో రిలీజ్ చెయ్యడం జరిగింది. 'రామరామ'అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంటే సాంప్రదాయ వస్త్రాలని ధరించిన చిరంజీవి,ఆంజనేయస్వామి వేషధారణతో ఉన్న పిల్లాడ్ని తన భుజస్కందాలపై ఎత్తుకున్నాడు.పక్కనే మరికొంత మంది ఆంజనేయస్వామి వేషధారణతో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు.టోటల్ గా 33 సెకన్ల నిడివితో ఉన్నప్రోమో ఆధ్యంతం భక్తి భావంతో నిండి ఉంది.
రామ జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందచేసాడు.చిరు సరసన త్రిష(trisha)ఆషికా రంగనాధ్ హీరోయిన్లుగా చేస్తుండగా చోట కె నాయుడు ఫొటోగ్రఫీ ని అందచేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



