
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే 'కల్ట్' తో చాలా గట్టిగానే కొడుతున్నాడని అనిపిస్తూ ఉంది. ప్రమోషన్స్ నే అందుకు సాక్ష్యం. పైగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకుడు కూడా తనే కావడంతో అంచనాలు పీక్ లో ఉన్నాయి. తెలుగు బాక్స్ ఆఫీస్ కి ఇప్పటివరకు పెద్దగా పరిచయం లేని సరికొత్త స్లాషర్ థ్రిల్లర్ కథాంశంతో కల్ట్ తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీలో విపరీతమైన బజ్ క్రియేట్ కాగా తాజాగా విడుదలైన డిస్ట్రిబ్యూటర్ల అధికారిక జాబితా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ని మరింత పెంచేసింది.
తెలంగాణ ప్రాంత హక్కులని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సునీల్, వైజాగ్ ప్రాంతంలో దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ (SVC) సంస్థ, ఉభయ గోదావరి జిల్లాలైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లెజెండరీ సంస్థ సురేష్ మూవీస్, కృష్ణా జిల్లాలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అలంకార్ ప్రసాద్, గుంటూరు జిల్లాలో పద్మావతి ఫిలిమ్స్ సుబ్బారావు, సీడెడ్ తిరుపతి ప్రసాద్, నెల్లూరు శ్రీ వెంగమాంబ సినిమాస్. కర్ణాటక మార్కెట్‌లో బెంగళూరు కేంద్రంగా కుమార్ ఫిలిమ్స్ భారీ విడుదలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ చిత్రానికి అత్యుత్తమ టెక్నికల్ నిపుణుల బలం కూడా బలంగా తోడైంది. కన్నడలో ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూరుస్తుండగా, టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ రైటర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి పదునైన డైలాగ్స్ అందించారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల అత్యున్నత నిర్మాణ విలువులతో నిర్మించారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా చేస్తుండగా , తారక్ పొన్నప్ప, మురళీ శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు ట్రైలర్ లో చూపించిన ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, భయానక వాతావరణం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అక్టోబర్ ౩౦ రిలీజ్ డేట్ .
ఇది కూడా చదవండి: కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' మూవీ ఆడియో రైట్స్‌కి రికార్డు ధర.. టాప్ హీరో రేంజ్ లో!

స్లాషర్ థ్రిల్లర్ అనేది హారర్, సస్పెన్స్ సినిమాల్లో దాగి ఉండే ఒక ప్రత్యేకమైన ఉప జానర్. ఈ రకమైన సినిమాల్లో సాధారణంగా ఒక సైకో కిల్లర్ లేదా ముసుగు ధరించిన వ్యక్తి ఒక సమూహాన్ని లేదా కొంతమంది వ్యక్తులని దారుణమైన ఆయుధాలతో వెంటాడి వేటాడి చంపడం ముఖ్య కథాంశంగా ఉంటుంది.
[vishwak Sen Cult Movie Distributors, Vishwak Sen Cult movie, Cult theatrical release, Vishwak Sen director, Asian Sunil Nizam rights, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]






