డ్రగ్స్ తీసుకొని తన ముందే బట్టలు మార్చుకోమని ఫోర్స్ చేసాడు.. ఆ హీరో అందరికి తెలుసు
on Apr 16, 2025
2019 లో మలయాళ చిత్ర సీమలో తెరకెక్కిన కామెడీ డ్రామా ఫిలిం 'వికృతి' ద్వారా ప్రేక్షకులకి పరిచయమైన నటి 'విన్సీ అలోషియస్'(Vincy Aloshious)ఈ మూవీలో 'జీనత్' అనే క్యారక్టర్ లో విన్సీ ప్రదర్శించిన నటనకి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత 'కనకం కామిని కలహం, భీమంతే వజి, జనగణమన, 1744 వైట్ ఆల్టో, రేఖ, పద్మిని వంటి పలు చిత్రాల్లో నటించి అభిమానుల్ని కూడా సంపాదించుకుంది. 'రేఖ' చిత్రానికి అయితే ఉత్తమ నటి కేటగిరిలో కేరళ స్టేట్ అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకొని తన సత్తా చాటింది.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో విన్సీ మాట్లాడుతు ఒక మూవీ షూటింగ్ టైంలో హీరో డ్రగ్స్ తీసుకునేవాడు. నాతో అనుచితంగా ప్రవర్తిస్తు తన ముందే దుస్తులు మార్చుకోమని ఇబ్బందులకి గురి చేసేవాడు. నా జీవితంలో ఇదొక పెద్ద అసహ్యకరమైన సంఘటన. దాంతో డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో నటించకూడదని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం వల్ల నాకు భవిష్యత్తులో అవకాశాలు రాకపోవచ్చు. నాతో అలా ప్రవర్తించిన హీరో గురించి అందరికి తెలుసు. ఎందుకంటే లొకేషన్ లో అందరి ముందే అసభ్యకరంగా మాట్లాడే వాడు. కానీ ఎవరు స్పందించలేదు. డ్రగ్స్ తీసుకోవడం అతని వ్యక్తిగత విషయం కావచ్చు. కానీ వృత్తి పరమైన వాతావరణంపై అది ప్రభావితం చూపించకూడదు కదా అని తన ఆవేదనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విన్సీ మాటలు సౌత్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.
'రేఖ' చిత్రం 2022 లో ప్రేక్షకుల ముందుకు రాగా, 2023 లో పద్మిని, ది ఫేస్ ఆఫ్ ఫేస్ లెస్, ఫజంజన్ ప్రణయం వంటి చిత్రాల్లో విన్సీ కనిపించింది. గత ఏడాది 'మారివిల్లియన్ గోపురంగల్' అనే ఒకే ఒక్క చిత్రాన్ని చెయ్యగా ఈ సంవత్సరం 'సూత్రవ్యాక్యం' అనే మూవీలో చేస్తుంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
