పోలీస్ గా వస్తున్న పోలీసోడు..!
on Apr 14, 2016
.jpg)
తమిళ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన తేరీ సినిమాను తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పోలీసోడు అనే టైటిల్ ను పెట్టారు. కానీ పోలీసులను ఏకవచనంతో పిలుస్తున్నట్లున్న ఈ టైటిల్ తమను కించపరిచే విధంగా ఉందంటూ, తెలంగాణా పోలీస్ అసోసియేషన్ దిల్ రాజుకు తమ వ్యతిరేకతను తెలియజేశారు. వారు చెప్పింది కూడా కరెక్ట్ గానే ఉందని భావించిన దిల్ రాజు, సినిమా టైటిల్ ను పోలీసోడు నుంచి పోలీస్ గా మారుస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్చిన టైటిల్ తో పోస్టర్లను ముద్రిస్తామని చెప్పారు దిల్ రాజు. మరో వైపు తమిళంలో ఈరోజే రిలీజైన తేరీకి, అక్కడి రివ్యూయర్లు యావరేజ్ రేటింగ్స్ ఇచ్చారు. మరి ఉండేకొద్దీ పుంజుకుంటుందా, తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా అనేవి చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



