విజయ్, పూరి బ్లైండ్‌గా వచ్చేస్తున్నారు.. టైటిల్ కూడా డిఫరెంటే!
on Jan 19, 2026
డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్‌ది ఒక విభిన్నమైన శైలి. అలాగే నటుడిగా విజయ్ సేతుపతిది ఒక డిఫరెంట్ స్టైల్. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఓ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అప్‌డేట్స్ మనం చూశాం. ఇప్పుడు టైటిల్‌ను కూడా రివీల్ చేశారు.
ఒక బెగ్గర్ స్టోరీ ప్రధానంగా ఈ సినిమాలో ఉంటుందని పూరి జగన్నాథ్ చెప్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమాలో బ్లైండ్ బెగ్గర్‌గా విజయ్ సేతుపతి పూర్తి స్థాయి నటనను ప్రదర్శించే అవకాశం ఉంది. నటనలో విజయ్, డైరెక్షన్‌లో పూరి ఏ స్థాయిలో రెచ్చిపోతారో మనకు తెలిసిందే. ఈ సినిమాకి 'స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్' చిత్రానికి సంబంధించి విజయ్‌సేతపతి లుక్‌ను రిలీజ్ చేశారు. ఇంతకుముందు విజయ్ చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు.
ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా టబు, దునియా విజరు మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పూరీ సూపర్ కంబ్యాక్‌లా కనిపిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. పూరీ మళ్లీ తిరిగి ఫాం లోకి వస్తే చూడాలని సినీ లవర్స్ కోరుతున్నారు. విజయ్ సేతుపతితో పూరీ చేస్తున్న ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అవుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



